జగన్ ఒక్కమాట చెబితే నీ పార్టీ మనుగుడ లేకుండా అయిపోతుంది.. చంద్రబాబుపై ఆళ్ల ఫైర్

జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రిని అవ్వగలననే ఒకేఒక దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Alla Ramakrishna Reddy : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేత ఆళ్ల రామక్రిష్ణారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి పై ఇలాంటి హత్యా ప్రయత్నంచేస్తే ఏనాటికికూడా రాజకీయాల్లో మనుగుడ సాగించలేరు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు అపూర్వమైన స్పందన వస్తుంది. చంద్రబాబు సభలకు జనాలు రాక వెలవెల బోతుంది. 2024లో కూడా జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని ఇలాంటి దాడులకు టీడీపీ నేతలు తెగబడుతున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Kodali Nani : చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సమయంలో .. ఇప్పుడు దాడులు

జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి లేకపోతే నేనే ముఖ్యమంత్రిని అవ్వగలననే ఒకేఒక దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దాడులు చేయించడంలో, చేయడంలో సిద్ధహస్తుడు. ఇలాంటి రాజకీయాలకు పాల్పడే గతంలో విజయవాడలో పింగళి దశరథ రామ్ అనే జర్నలిస్టును ఏం చేయించావో ప్రజలందరికీ తెలుసు. బెజవాడ బొబ్బిలి వంగవీటి రంగను ప్రజల్లో లేకుండా నువ్వు, నీ టీడీపీ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి కుట్రలు విజయవాడలో చేయించడంలో చంద్రబాబు సిద్ధహస్దుడని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Also Read : ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. జగన్ పై దాడి ఘటన గురించి సజ్జల కీలక వ్యాఖ్యలు

జగన్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి ఒక్కమాట చెబితే టీడీపీ మనుగడ లేకుండా పోతుంది. జగన్ మోహన్ రెడ్డి మా అందరికీ ఇచ్చిన సందేశం వల్లనే ఈరోజు నువ్వు, నీ పార్టీ బతికి ఉంది చద్రబాబు అంటూ ఆళ్ల హెచ్చరించారు. 2024లో మరోసారి జగన్ మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నాడని ఆళ్ల దీమా వ్యక్తం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు