Kodali Nani : చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సమయంలో .. ఇప్పుడు దాడులు

చాలా పకడ్బందీగా, వ్యూహం ప్రకారంగా గురిచూసి కొట్టాలని చూశారని, ప్రచారంలో కదలికల వల్ల గురితప్పి రాయి కన్నువద్ద తగిలిందని కొండాలి నాని అన్నారు.

Kodali Nani : చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సమయంలో .. ఇప్పుడు దాడులు

Kodali Nani

CM Jagan Injured In Stone Attack : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి గురించి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరిగిందని, చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో, ఇప్పుడు దాడులు జరిగాయంటూ కొడాలి నాని ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే జగన్ పై దాడి జరిగిందని, దుర్మార్గుడు, సైకో జగన్ మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని శనివారం మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు చెప్పాడని, తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు మాటలు విని సీఎం జగన్ ను చంపడానికి ప్రయత్నించారని కొడాలి నాని అన్నారు.

Also Read : ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. జగన్ పై దాడి ఘటన గురించి సజ్జల కీలక వ్యాఖ్యలు

చాలా పకడ్బందీగా, వ్యూహం ప్రకారంగా గురిచూసి కొట్టాలని చూశారని, ప్రచారంలో కదలికల వల్ల గురితప్పి రాయి కన్నువద్ద తగిలిందని కొండాలి నాని అన్నారు. దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టి సీఎం జగన్ గాయంతో బయటపడ్డారని, దాడిని ఖండించాల్సిన పెద్దలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, ఓడిపోతాడని సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన తొమ్మిది సంస్థలు చేసిన సర్వేల్లో వైసీపీకి 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పాయని, జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఏమీ చేయలేని కొందరు రాజకీయ నిరుద్యోగులు.. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారన్న కక్షతో, కొన్నివర్గాలు కలిసి జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేశాయంటూ కొడాలి నాని ఆరోపించారు.

Also Read : BJP Manifesto Release : బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..

ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికి ప్రయత్నం జరిగిందంటే దీని వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారని కొడాలి నాని అనుమానం వ్యక్తం చేశారు. ఎంతో పక్కాగా దాడి చేయబట్టే సీఎం జగన్ కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలి ఆయన గాయపడ్డాడని అన్నారు. ప్రధాని, సీఎం స్థాయి వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు, పగలైనా రాత్రయినా కరెంట్ తీసేస్తారు. ఆ విషయం సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియదా? బస్సుపై ఆయన రోడ్ షోలు చేసినప్పుడు కరెంటు తీయలేదా? సీఎం జగనే కావాలని కరెంట్ తీయించారని పిచ్చివాగుడు వాగుతున్నారని, అధికారులపై యాక్షన్ తీసుకోవాలంటూ చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కొడాలి నాని మండిపడ్డారు.