Amaravathi Farmers : 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ.. అనుమతి కోరిన అమరావతి రైతులు

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూర పరిధిలో కొనసాగుతోంది. ఈ నెల 17న తిరుపతిలో యాత్ర ముగియనుంది. ఆ రోజున..

Amaravathi Farmers : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూర పరిధిలో కొనసాగుతోంది. ఈ నెల 17న తిరుపతిలో యాత్ర ముగియనుంది. ఆ రోజున తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. రేణిగుంటలో సభకు అనుమతి ఇవ్వాలని ఎస్పీకి వినతిపత్రం కూడా సమర్పించారు. ఈ సభకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రానున్నారని జేఏసీ నేతలు చెప్పారు.

”అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమస్య కాదు. అది 5 కోట్ల ప్రజల భవిష్యత్తు’’ అని నినదిస్తూ రాజధాని రైతులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు రాజధాని అమరావతికి మద్దతుగా తిరుపతిలో ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించాలని అఖిలపక్షం నాయకులు నిర్ణయించారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్‌, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీల ప్రతినిధులు, అమరావతి పరిరక్షణ సమితి నేత తిరుపతిరావు పాల్గొన్నారు.

Winter Weight Loss : చలికాలంలో వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం ఎలా?

ఈ నెల 9న జిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్రకు ఘన స్వాగతం పలకాలని, 17న దాదాపు 50 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో రైతులు చేస్తున్న మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది.

Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం…ఆరోగ్యానికి మంచిదా?

అమరావతి రైతుల ఉద్యమం విజయవంతవుతుందని జేఏసీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదన్నారు. అభివృద్ధి వికేంద్రరణ అంటే ఊరికో ప్యాలెస్‌ కట్టుకోవడం కాదని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్రను కొనసాగిస్తామని, అనుకున్నది సాధిస్తామని అమరావతి జేఏసీ నేతలు తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు