Winter Weight Loss : చలికాలంలో వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం ఎలా?

అనారోగ్యానికి దారితీసే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి బదులు... ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారానికి చోటు కల్పించాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది.

Winter Weight Loss : చలికాలంలో వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం ఎలా?

Exercise

Winter Weight Loss :  చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం.కఠిన వ్యాయామాలతో శరీర బరువు తగ్గించుకోవాలని ఆలోచన చేసినా బాడీ సహకరించదు. అదేక్రమంలో శీతాకాలంలో వేపుడు పదార్థాలు, మసాలాలు, స్వీట్లు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని కోరిక అధికంగా కలుగుతుంది. దీంతో పరిమితికి మించి ఈ తరహా ఆహారాలను లాగించేస్తారు. మన జీవక్రియను పెంచే నీటిని సైతం చాలా మంది తక్కువగానే తీసుకుంటారు. నడవడం, వ్యాయామం చేయడం, జిమ్‌కి వెళ్లాలంటే బద్దకం వేస్తుంది. దీని వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు.

ముఖ్యంగా చలికాలంలో కఠిన మైన వ్యాయామాలు లేకుండానే ఆహారపు అలవాట్లో కొద్ది పాటి మార్పులు చేయటం ద్వారా బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు. అలాంటి ఆహారాల విషయానికి వస్తే దాల్చిన చెక్క ఒక అద్భుతమైన మరియు సువాసనగల మసాలా. ఇది సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన అద్భుతమైన ఔషధం కూడా. దాల్చిన చెక్క దాని ప్రత్యేక లక్షణాలతో సహజంగా జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, దాల్చిన చెక్కలోని సిన్నమాల్డిహైడ్ కొవ్వు విసెరల్ కణజాలాల జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా సహజంగానే శరీర బరువు తగ్గుతుంది. దాల్చినచెక్కను ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల బరువు తగ్గటానికి దోహదపడుతుంది.

ఈ శీతాకాలంలో కరకరలాడే స్నాక్స్‌కు బదులుగా పోషకాలు అధికంగా ఉండే తాజా ఆహారాలను పరిగణించండి. క్యారెట్‌లో ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది మీ ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. నిజానికి క్యారెట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని స్మూతీ, సలాడ్, జ్యూస్‌గా తినవచ్చు.చలికాలంలో బరువు తగ్గడానికి క్యారెట్లు మీకు సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి మరియు బరువు తగ్గాలనుకునే వారికి మెంతులు చక్కగా ఉపకరిస్తాయి. మెంతుల్లో ఉన్న ప్రత్యేక ఔషధ గుణాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితం మీ బరువు తగ్గవచ్చు.

చలికాలంలో పుష్కలంగా లభించే పండు జామపండు. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును ఆహారంలో చేర్చుకోవచ్చు. బీట్ రూట్ ను ఆహారంలో చేర్చుకుంటే ఉత్తమ ప్రయోజనాలను పొందవచ్చు. జ్యూస్ మరియు సలాడ్‌ల మాదిరిగానే బీట్ రూట్‌ని మీ ఆహారంలో చేర్చుకోండి.

అనారోగ్యానికి దారితీసే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి బదులు,  ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారానికి చోటు కల్పించాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది. మంచినీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గే విషయంలో బాగా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ సేపు పొట్ట ఫుల్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

శరీరానికి సరిపోయే ప్రోటీన్ ఫుడ్ మాత్రం అందేలా చూసుకోవాలి. క్యాలరీలు తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ ఉండటం చాలా ముఖ్యం. సరిపోను నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర సరిగాలేకపోయినా కూడా విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్స్ నేచురల్ గా శరీరం యొక్క మెటబాలిజం రేటును పెంచుతాయి. దాంతో వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

రాత్రి చాలా త్వరగా భోజనం చేయాలి. లేట్ నైట్ డిన్నర్లకు స్వస్తి చెప్పాలి . ఇలా తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణంమై బరువు తగ్గడానికి సహాయపడుతుంది. భోజనం నిధానంగా తినడం వల్ల పొట్ట త్వరగా నిండుతుంది. మరియు ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరిక అనిపించదు. దాంతో బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ప్రోటీన్స్, విటమిన్స్ మరియు ఎనర్జీ లెవల్స్ అధికంగా ఉంటాయి . మరియు వాటిని క్యాలరీలు చాలా తక్కవుగా ఉంటాయి. బరువు సులభంగా తగ్గవచ్చు. డైటింగ్ చేకుండాను బరువు తగ్గించుకోవాలనుకొనే వారు గ్రీన్ టీని తీసుకోవాలి. ఇది బరువు తగ్గించడానికి శరీరంలో క్రొవ్వు కరిగించడానికి బాగా సహాయపడుతుంది.