అమరావతి టూర్ : పోరాటం నా కోసం కాదు..ప్రజల కోసం – బాబు

  • Publish Date - November 28, 2019 / 11:04 AM IST

పోరాటం చేసేది తన కోసం కాదు..ప్రజల కోసం అంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వైసీపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రాజధానిని శ్మశానంతో పోలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రాజధానితోనే ప్రజల అభివృద్ధి ముడిపడి ఉంటుందన్నారు. రాజధాని విషయంలో తాను చేసింది రైటో..రాంగో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం బాబు అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా బాబుతో 10tv మాట్లాడింది. 

ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఏపీలో ప్రతొక్కరి భవిష్యత్‌కు సంబంధించిన విషయం. సుందరమైన ప్రపంచంలోనే అత్యంత ఆధునీకంగా కట్టే..రాజధానిని వైసీపీ మంత్రులు శ్మశానంతో పోలుస్తున్నారని గుర్తు చేశారు. ఒకపక్క అసెంబ్లీలో చట్టాలు చేస్తున్నారు..సెక్రటేరియట్‌లో సీఎం..ఇతర అధికారులు కూర్చొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తారని తెలిపారు. ఇంత పవిత్ర దేవాలయాలు ఉండే..ఈ స్థలాన్ని మంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడారని విమర్శించారు. అహంభావం..ప్రజలు ఏమి చేయలేరు..తమ పని తాము చేస్తామని దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. 

తనకంటే మెరుగ్గా చేస్తారని ప్రజలు ఆలోచిస్తే..ఇలా చేస్తారా ? ఇదా మెరుగైన పాలన అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలని బాబు సూచించారు. ఈ నగరం సంపద సృష్టిస్తుందా, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి జరుగుతుందా ? లేదా అని ప్రజలు ఆలోచించాలన్నారు. భవిష్యత్‌లో ఏ విధంగా నష్టం జరుగుతుందో చెప్పడం తన బాధ్యత అని..నిర్ణయం తీసుకొనేది మాత్రం ప్రజలేదన్నారు బాబు. 
Read More : బాబు సాష్టాంగ నమస్కారం

ట్రెండింగ్ వార్తలు