Videos: ఆర్టీసీ బస్సులో అంబటి.. ఆటోలో పవన్ కల్యాణ్.. ఇస్త్రీ చేసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

ఇవాళ ఉదయం తన నియోజకవర్గంలోని ఓ దుకాణంలో టీ తయారు చేశారు.

Pawan-Ambati

ఎన్నికల వేళ నేతలు ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కి అందులోనే ఎన్నికల ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లి పట్టణంలో బస్సు ఎక్కి ప్రయాణికులకు వైసీపీ ఎన్నికల కరపత్రాలు పంచారు. తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి చెప్పారు.

ఏపీలోని ఫిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆటోలో ప్రయాణించారు. నవారు మంచంపై కూర్చొని ప్రజలతో ముచ్చటించారు. ఓ పాపను ఎత్తుకుని ఆడించారు.

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను కలిశారు. ఓ ప్రాంతంలో ఇస్త్రీ చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ, గోరఖ్‌పూర్ అభ్యర్థి రవి కిషన్ ‘జన్ సంపర్క్ అభియాన్’లో భాగంగా ఇవాళ ఉదయం తన నియోజకవర్గంలోని ఓ దుకాణంలో టీ తయారు చేశారు.

ట్రెండింగ్ వార్తలు