old lady attempted suicide
Old Lady Attempted Suicide : అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ వృద్ధురాలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బుచ్చయ్యపేట మండలం తురకలపూడి గ్రామానికి చెందిన దళిత మహిళ పలివెల పోలమ్మ.. తన భర్త పేరున ఉన్న ఎకరా డీఫారం పట్టా భూమిని తన పేరుపైకి మార్చాలంటూ ఏడాదిగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది.
భూ రీ సర్వేలో భాగంగా పోలమ్మ పేరు మార్పు చేస్తామని చెప్పి.. రెవెన్యూ సిబ్బంది 20 వేల రూపాయలు తీసుకున్నారని.. అయినా పట్టా మార్పు చేయలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. దీనిపై విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం స్పందనలో పలుమార్లు ఫిర్యాదు చేసింది. తరువాత కొత్తగా ఏర్పడిన అనకాపల్లి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి మొరపెట్టుకుంది.
Telangana Assembly డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని..తెలంగాణ అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అయినా ప్రయోజనం లేకపోవడంతో విసిగిపోయిన పోలమ్మ.. పెట్రోల్ తీసుకొని తన ఒంటిపై పోసుకుంది. దీంతో కార్యాలయ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కలెక్టర్‌తో మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూడాలని సూచించారు.