బాలికను కాపాడిన దిశ యాప్: 10నిమిషాల్లోనే అరెస్టు

బాలికను కాపాడిన దిశ యాప్: 10నిమిషాల్లోనే అరెస్టు

Updated On : February 17, 2020 / 1:30 AM IST

మహిళా జాతి రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ యాప్.. మారు మూల గ్రామాల్లోనూ ఏ అఘాయిత్యం జరగకుండా కాపాడగల్గుతుంది. అనంతపురం జిల్లాలో ఓ బాలికను అర్ధరాత్రి కాపాడారు పోలీసులు. నిందితుడిని 10నిమిషాల్లో అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గుమ్మఘట్ట మండలంలోని 75 వీరాపురం తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్‌ జయంతోత్సవాలు జరిగాయి. స్థానికులంతా ఉత్సవంలో పాల్గొన్నారు. 16 ఏళ్ల బాలికకు నిద్ర వస్తుందని త్రి 12:45 నిమిషాలకు పక్క వీధిలోనే ఇంటికి వెళ్లేందుకు బయల్దేరింది. 

ఆమెపై ముందునుంచి కన్నేసిన తిరుపాల్‌నాయక్‌ (21) అనే యువకుడు వెంబడించాడు. కోరిక తీర్చాలంటూ చెయ్యి పట్టుకోవడంతో చెంప మీద కొట్టి గట్టిగా కేకలు పెట్టిందా అమ్మాయి. తక్షణ సాయం కోసం ‘దిశ యాప్‌’కు మెసేజ్‌ చేసింది. ఆ లోపు అటువైపుగా వెళ్తున్న బాలిక బాబాయి ఘటనను గమనించి అక్కడికి చేరుకునేలోగా యువకుడు పరారయ్యాడు. 

సమాచారం అందుకున్న విజయవాడ ‘దిశ’ కంట్రోల్‌ రూమ్‌.. జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియచేయడంతో రాయదుర్గం రూరల్‌ సీఐ పి.రాజ, ఎస్‌ఐ తిప్పయ్యనాయక్‌లను ఎస్పీ అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 10 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. 

ఇంట్లో దాక్కున్న తిరుపాల్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 

Read More>> గాజుల కోసం గొడవ.. తల్లీ ఆత్మహత్య, కూతురి పరిస్థితి విషమం