Andhra pradesh: వైద్యం వికటించి బాలింత మృతి

విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి నీరజ అనే తొమ్మిది రోజుల బాలింత మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

Andhra pradesh: విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి నీరజ అనే తొమ్మిది రోజుల బాలింత మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం వైద్యులు ఇంజక్షన్ చేయడం వల్ల తమ బిడ్డ సొమ్మసిల్లి పడిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె మరణించిందని, అయితే, ఏ కారణంతో చనిపోయిందో ఇప్పటివరకు వైద్యులు సమాధానం చెప్పడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

Anakapalli Crime: మొన్న పుష్ప, నేడు స్వాతి: పోలీసులే బిత్తరపోయేలా అనకాపల్లిలో యువతులు హైడ్రామాలు

బాలింత మరణించిన వెంటనే, మృతదేహాన్ని తీసుకెళ్లాలని తమపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించిందని, పోస్ట్‌మార్టం చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన తర్వాతే, అక్కడ్నుంచి తీసుకెళ్తామని చెబుతున్నారు. మృతురాలు కుటుంబం నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వాళ్లు.

ట్రెండింగ్ వార్తలు