Anakapalli Crime: మొన్న పుష్ప, నేడు స్వాతి: పోలీసులే బిత్తరపోయేలా అనకాపల్లిలో యువతులు హైడ్రామాలు

అసలు యువతిపై ఎవరూ దాడి చేయలేదని..తన మేన మామ కొండబాబును పోలీస్ కేసులో ఇరికించేందుకే స్వాతి ఈ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు

Anakapalli Crime: మొన్న పుష్ప, నేడు స్వాతి: పోలీసులే బిత్తరపోయేలా అనకాపల్లిలో యువతులు హైడ్రామాలు

Crime

Anakapalli Crime: ఇటీవల అనకాపల్లిలో జరుగుతున్న నేరాలు చూసి పోలీసులే విస్తుపోతున్నారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ పుష్ప అనే యువతీ కాబోయేవాడి గొంతు కోసింది. ఇటీవల చోటుచేసుకున్న ఈఘటనలో బాధితుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగా..యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి ఘటనే మరోసారి అనకాపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం..అనకాపల్లికి చెందిన స్వాతి అనే యువతిని గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు సమాచారం అందింది. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు పూర్తి విచారణ చేపట్టగా..విస్తుపోయే విషయం బయటపడింది. అసలు యువతిపై ఎవరూ దాడి చేయలేదని..తన మేన మామ కొండబాబును పోలీస్ కేసులో ఇరికించేందుకే స్వాతి ఈ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. కొండబాబుకు, స్వాతి కుటుంబానికి గత కొన్ని రోజులుగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈక్రమంలో ఇటీవల పంచాయితీకి వచ్చిన కొండబాబు..రూ.4 లక్షలు ఇచ్చి ఆస్తి తగాదాలపై రాజీ పడ్డాడు. అదే సమయంలో నాయుడుపేటలో ఉన్న ఇంటిని కొండబాబు అమ్మేశాడు.

Also read:Ruia Ambulance Mafia : రుయాలో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు.. 90కి.మీ బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

అయితే ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో రూ.5 లక్షలు నగదు, 5 తులాల బంగారం తమకు ఇవ్వాలని స్వాతి కుటుంబ సభ్యులు కొండబాబును డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్వాతిని పెళ్లి చేసుకోవాలంటూ ఇతర కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కొండబాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే స్వాతిని పెళ్లి చేసుకోవడం ఇస్తాహం లేని కొండబాబు..అందుకు తిరస్కరించాడు. ఈక్రమంలోనే సోమవారం స్థానిక ఆలయం వద్దకు వెళ్లిన స్వాతి తనపై తానే దాడి చేసుకుని..,నూకరాజు(కొండబాబు స్నేహితుడు) అనే వ్యక్తి తనపై దాడి చేశాడంటూ స్వాతి పోలీసులకు తెలిపింది. అయితే స్వాతి ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..ఆలయం చుట్టుప్రక్కల ఉన్న సీసీకేమెరా ఫుటేజీని సేకరించారు. స్వాతి తన గొంతు తానే కోసుకుంటున్న దృశ్యాలు సీసీ కేమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో స్వాతిని విచారించగా అసలు విషయం బయపడింది. ఆస్తి కోసం మేనమామ కొండబాబును పోలీస్ కేసులో ఇరికించేందుకే నిందితురాలు స్వాతి ఈ నాటకమాడినట్లు పోలీసులు తేల్చారు.

Also read:Minister Vidadala Rajini: అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టం: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని