Ruia Ambulance Mafia : రుయాలో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు.. 90కి.మీ బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

జయశివ అనే బాలుడు కిడ్ని, ఇతర అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు.

Ruia Ambulance Mafia : రుయాలో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు.. 90కి.మీ బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

Ruia

Ruia Ambulance Mafia : తిరుపతి రుయాలో అంబులెన్స్‌ మాఫియా మరోసారి రెచ్చిపోయింది. సిండికేట్‌గా మారి చిన్నారి మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకుంది. మృతదేహాన్ని తరలించడానికి రూ.20వేలు డిమాండ్‌ చేసిన అంబులెన్స్ డ్రైవర్లు.. ప్రైవేట్‌ అంబులెన్స్‌ను ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. ఆసుపత్రిలోకి వస్చే చంపేస్తామంటూ ప్రైవేట్‌ అంబులెన్స్ డ్రైవర్‌ను హెచ్చరించారు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఏం చేయాలో తెలియక బైక్‌పైనే బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లాడా తండ్రి. 90కిలోమీటర్లు బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని కోడూరుకు తీసుకెళ్లాడా తండ్రి.

జయశివ అనే బాలుడు కిడ్ని, ఇతర అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈనేపథ్యంలో ఆ కుటుంబీకులది అన్నమయ్య జిల్లా గూడూరు నియోజకవర్గం. అయితే ఆస్పత్రి నుంచి మృతేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ను ఆశ్రయించారు. రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో నిజానికి బాలుడి తండ్రి నర్సింహులు రోజువారి కూలీ. పొలం దగ్గర కాపాలా కాస్తూ జీవిస్తుంటాడు. ఈనేపథ్యంలో 20 వేలు తను భరించలేనని.. వారితో కాళ్లవేళ్ల పడ్డాడు. అయినా వారు కనికరించలేదు.

AP High Court : రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ

దీంతో అతను ప్రైవేట్‌ అంబులెన్స్‌ను ఆశ్రయించారు. కానీ ప్రైవేట్‌ అంబులెన్స్‌ను ఆసుపత్రిలోకి రాకుండా రుయా అంబులెన్స్ యాఫియా అడ్డుకుంది. ఆసుపత్రిలోకి వస్చే చంపేస్తామంటూ ప్రైవేట్‌ అంబులెన్స్ డ్రైవర్‌ను హెచ్చరించారు. దీంతో ఆ డ్రైవర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో తండ్రికి ఏం చేయాలో తెలియక బైక్‌పైనే బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. 90కిలోమీటర్లు బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని కోడూరుకు తీసుకెళ్లాడు.

నిజానికి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. కేవలం తాము ఎంత ధర పలికతే అంత ధరతోనే మృతదేహాన్ని తరలించారు. బయటి అంబులెన్స్ ను రుయా ఆస్పత్రిలోకి రానిచ్చే పరిస్థితి లేదు. ఈ ఘటనలో బయటి ప్రైవేట్ అంబులెన్స్ కేవలం 8 నుంచి 9 వేల రూపాయలతో బాలుడి మృతదేహాన్ని కోడూరుకు తరలించేందుకు ముందుకువచ్చినప్పటికీ ఆ డ్రైవర్ ను తీవ్రంగా బెదిరించారు. అంబులెన్స్ తీసుకుని లోపలికి వస్తే నిన్ను చంపేస్తామని డ్రైవర్ ను బెదిరిండంతో ఆ అంబులెన్స్ బయటే ఉండిపోవాల్సివచ్చింది.

Tirupati Hospital : తిరుపతి ఆస్పత్రిలో మరణ మృదంగం..వారంలో తొమ్మిది శిశువులు మృతి

దిక్కు తోచని స్థితిలో తండ్రి నర్సింహులు తన కుమారిడి మృతదేహాన్ని బైక్ పై పెట్టుకొని వెనుక కూర్చుని నేరుగా కోడూరు వరకు అలాగే తీసుకెళ్లిపోయాడంటే ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు
ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాళ్లవేళ్ల పడ్డా ఏ మాత్రం కనికరించలేదు. ధర తగ్గించలేదు. బయటి నుంచి అంబులెన్స్ వచ్చినా లోపలికి రానివ్వలేదు.