Ap Corona Cases
Ap Corona : ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 48028 కరోనా పరీక్షలు చేయగా, 643 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 145 కొత్త కేసులు తేలాయి. అలాగే, తూర్పు గోదావరి జిల్లాలో 84, గుంటూరు జిల్లాలో 81, కృష్ణా జిల్లాలో 74, నెల్లూరు జిల్లాలో 69, ప్రకాశం జిల్లాలో 60, విశాఖ జిల్లాలో 46 కరోనా కేసులు గుర్తించారు.
Read More : Coronavirus Updates: మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కేరళలోనే ఎక్కువగా!
అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. అలాగే, గడిచిన 24 గంట్లో 839 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు 14,236 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,55,306 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,32,520 మంది కోలుకున్నారు. ఇంకా 8,550 మంది చికిత్స పొందుతున్నారు.
Read More : CM Jagan : ఇక మరింత సులభంగా వైద్యం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు