CM Jagan : ఇక మరింత సులభంగా వైద్యం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, హెల్త్ హబ్స్, డిజిటల్ హెల్త్ పై అధికారులతో చర్చించారు. వా

CM Jagan : ఇక మరింత సులభంగా వైద్యం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Cm Jagan

CM Jagan : వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, హెల్త్ హబ్స్, డిజిటల్ హెల్త్ పై అధికారులతో చర్చించారు. వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో స్పెషలైజేషన్ తో కూడిన ఆసుపత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. హెల్త్ హబ్స్ లో ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వైద్యం కోసం ఏపీ ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదన్నారు. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో తెలుసుకుని మన రాష్ట్రంలో ఆయా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని జగన్ సూచించారు.

SBI Gold డిపాజిట్ స్కీమ్ ఏంటి? ఎన్ని రకాలు, అర్హతలేంటి?

అలాగే ఏపీలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతిపై జగన్ సమీక్ష నిర్వహించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంలో ఏవైనా అంశాలు పెండింగ్ లో ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ నెలాఖరులోపు వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పనులు శరవేగంగా ముందుకు సాగాలన్నారు సీఎం. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పైనా సమీక్షించారు. కొత్త పీహెచ్ సీల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న పీహెచ్ సీలలో నాడు-నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 26 నాటికి పూర్తి స్తాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమల్లోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులతో చెప్పారు. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Tomato Cultivation : టమాటా సాగుతో భారీ లాభాలు…ఆరు నెలల్లో 30లక్షల ఆదాయం

పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య మిత్రల నెంబర్లు సచివాలయంలోని హోర్డింగ్స్‌లో ఉండాలన్నారు. హెల్త్ కార్డుల్లో ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాల్ని క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశముండాలని జగన్ చెప్పారు. వ్యక్తికి సంబంధించిన పరీక్షలు, ఫలితాలు, చికిత్స, వాడుతున్న మందులు అన్నింటినీ ఆ వ్యక్తి డేటాలో భద్రపర్చాలన్నారు. దీంతో వైద్యం కోసం ఎక్కడికి వెళ్లినా ఈ వివరాల ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో బ్లడ్ గ్రూప్ లాంటి వివరాలు కూడా ఉండాలని జగన్ సూచించారు. డిజిటల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ హెల్త్ ఐడీలు క్రియేట్ చేస్తున్నామని అధికారులు సీఎంకి తెలిపారు.

ఇక రాష్ట్రంలో కొవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ పై జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 11వేల 997 సచివాలయాల్లో జీరో కరోనా కేసులు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు 1.62 శాతంగా, రికవరీ రేటు 98.86గా ఉందన్నారు. థర్డ్‌వేవ్‌ హెచ్చరికల రాష్ట్రంలో 20 వేల 964 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచామని అధికారులు సీఎంకి వివరించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల 27 వేల 470 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, వీరిలో సుమారు కోటి 44 లక్షల మందికిపైగా రెండు డోసులు పూర్తయినట్టు వివరాలు వెల్లడించారు.