SBI Gold డిపాజిట్ స్కీమ్ ఏంటి? ఎన్ని రకాలు, అర్హతలేంటి?

దేశీయ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ఎస్బీఐ తమ మూడు రకాల డిపాజిట్ పథకాలను ఆఫర్ చేస్తోంది.

SBI Gold డిపాజిట్ స్కీమ్ ఏంటి? ఎన్ని రకాలు, అర్హతలేంటి?

Sbi Gold Deposit Scheme Interest Rate, Tenure And Other Details

SBI gold deposit scheme: దేశీయ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ఎస్బీఐ తమ మూడు రకాల డిపాజిట్ పథకాలను ఆఫర్ చేస్తోంది. అందులో ఒకటి Revamped Gold Deposit Scheme (R-GDS0.. ఇది బంగారాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే స్కీమ్.. రీవాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (R-GDS)కింద ఎస్బీఐ వినియోగదారులు తమ బంగారాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద భద్రత, వడ్డీ, ఆదాయాలను పొందవచ్చు. R-GDS స్కీమ్ కింద దాచుకున్న బంగారానికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వడ్డీ పొందవచ్చు.

ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టేందుకు భారతీయ పౌరులు, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUF), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కింద రిజిస్టర్ అయిన మ్యూచువల్ ఫండ్లు/ఎక్స్ఛేంజ్- ట్రేడెడ్ ఫండ్స్ వర్గాలకు అర్హత ఉంది. అంతేకాదు.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ లో చేరాలంటే కనీసం 10 గ్రాముల ముడి బంగారాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి ఏమీ ఉండదు. ముడి బంగారం అనగా నాణేలు, కడ్డీలు నగలు, రాళ్లు, ఇతర మెటల్స్ ఉన్నాయి. బరువుతో సంబంధం లేకుండా పరిగణిస్తారు. SBI రీవాంప్డ్గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (R-JDS) మూడు రకాల డిపాజిట్లను ఆఫర్ చేస్తోంది. స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ (STBD) కింద టర్మ్ 1 ఏడాది నుంచి 3ఏళ్ల వరకు అనుభవించాల్సి ఉంటుంది. మధ్యకాలిక ప్రభుత్వ డిపాజిట్ (MTGD) కాలవ్యవధి 5-7 సంవత్సరాలుగా నిర్ణయించింది. దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ (LTGD) కాలవ్యవధి 12-15 ఏళ్లు వరకు ఉంటుంది.
#justiceforlisa : ఎవరీ లీసా? ట్విట్టర్ లో మోత..ఉప్పెనలా వచ్చిపడున్న టీట్లు

స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ (STBD)కి ఏడాదికి 0.50శాతంగా ఉంది. ఒక ఏడాది నుంచి 2 సంవత్సరాల వరకు డిపాజిట్లకు 0.55శాతం వరకు పొందవచ్చు. అదే రెండు ఏళ్ల నుంచి మూడు ఏళ్ల వరకు డిపాజిట్లకు 0.60శాతం చెల్లిస్తారు. మధ్యకాలిక ప్రభుత్వ డిపాజిట్లపై వడ్డీ రేటు ఏడాదికి 2.25శాతంగా ఉంది. దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్లపై వడ్డీ రేటు ఒక ఏడాదికి 2.50శాతంగా ఉంది.

స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ (STBD) మెచ్యూరిటీ తేది నాటికి బంగారం లేదా సమానమైన నగదును బ్యాంక్ చెల్లిస్తుంది. అదే మధ్య కాలిక ప్రభుత్వ డిపాజిట్, దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ (SMGD LTGD) మెచ్యూరిటీ తేది నాటికి ప్రస్తుత ధర ప్రకారం బంగారం విలువకు సమానమైన విలువను కట్టి నగదు రూపంలో అందిస్తుంది. 0.20శాతం ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్బీఐ అందించే మూడు రకాల గోల్డ్ స్కీమ్ ల్లో STBD నుంచి ఏడాది పాటు లాక్ ఇన్ వ్యవధి తర్వాత ఇది వర్తిస్తుంది. ఏడాది లాక్-ఇన్ వ్యవధి తర్వాత వర్తించే వడ్డీ రేటుపై పెనాల్టీతో ముందస్తు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. MTGD వడ్డీపై పెనాల్టీతో సొంతం చేసుకోవచ్చు. వడ్డీపై పెనాల్టీతో మూడు ఏళ్లు తర్వాత ఎప్పుడైనా ఆ నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఆఖరిది అయిన LTGD జరిమానాతో ఐదేళ్లు తర్వాత ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
Ajith: నా చావుకి కారణం అజితే.. హీరో ఇంటి ఎదుటే మహిళ ఆత్మహత్యాయత్నం!

  • ఒక ఏడాదిపైన : 0.50శాతం
  • ఏడాది నుంచి రెండేళ్ల వరకు 0.55శాతం.
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు 0.60 శాతం వడ్డీ LTGD స్కీమ్ కింద యూజర్లకు నిబంధన 2.50 శాతం వడ్డీ రేటు పెంపు