#justiceforlisa : ఎవరీ లీసా? ట్విట్టర్ లో మోత..ఉప్పెనలా వచ్చిపడున్న ట్వీట్లు..

#justiceforlisa..ట్విట్ల ఉప్పెన సృష్టిస్తోంది. ఎవరీ లీసా? లీసాను న్యాయం చేయాలంటూ మిలియన్ల కొద్దీ ట్వీట్లు వెల్లువెత్తున్నాయి. ఎవరీ లీసా? ఏం జరిగింద?

#justiceforlisa : ఎవరీ లీసా? ట్విట్టర్ లో మోత..ఉప్పెనలా వచ్చిపడున్న ట్వీట్లు..

#justiceforlisa

Twitter Trend..‘Justice For Lisa’ : #justiceforlisa..ట్విట్టర్ లో ట్వీట్ల ఉప్పెన సృష్టిస్తోంది. ఎవరీ లీసా? ఈమెకు ఏమైంది. లీసా పేరుతో పాత ట్వీట్లు డిలీట్ చేస్తున్నా కొత్త ట్వీట్లు ఎందుకు ముప్పిరిగొంటున్నాయి? ఎందుకు వెల్లువలా వచ్చి పడుతున్నాయి? ఇప్పటికే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు దాటిపోయినా ఇంకా ట్వీట్ల వెల్లువ ఎందుకు కొనసాగుతోంది? ఈ లీసాకు జరిగిన అన్యాయం ఏంటీ? జరగాల్సిన న్యాయం ఏంటీ? అసలు ఎవరీ లీసా? ఎంతకీ ట్వీట్ల సునామీ? పట్టుపని 25 ఏళ్లు కూడా లేని లీసా అనే యువతి హ్యాష్‌ట్యాగ్..వెనుక జరిగిందంటో తెలుసుకుందాం..

లీసా మనోబల్. వయస్సు 24 ఏళ్లు. కళ్లు తిప్పుకోనివ్వని అందం. సొగసు అంతా పోతపోసి సౌందర్యరాశిల. మైమరపించే గానంతో జలపాతంలాంటి సోయగాల లీసా ఓ పాప్‌ సింగర్‌. ఆమె కోసం కోట్లా మంది కదిలారు. justiceforlisa.. అని నినదిస్తున్నారు. ట్విటర్‌లో లీసా పేరు మోత మోగిపోతోందీ హ్యాష్‌ట్యాగ్‌. లీసా అనే యంగ్‌ ర్యాపర్‌కు న్యాయం చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ట్వీట్ల ఉప్పెనతో డిమాండ్ చేస్తున్నారు.ఓవైపు పాత ట్వీట్లు డిలీట్‌ చేస్తుంటే..మరోవైపు లక్షలాదిగా కొత్త ట్వీట్లు పుట్టుకొస్తుంన్నాయి. ఆ వెల్లువ ఆగటంలేదు. ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు దాటిపోయాయి అంటే ఆ రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు..!

Read more : Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు

బ్లాక్ పింక్ లో లీసా స్పెషాలిటీ..
దక్షిణ కొరియా పాప్‌ గ్రూప్‌ ‘బ్లాక్‌పింక్‌’. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ గ్రూప్‌లోని నలుగురు సింగర్స్‌ ఉన్నారు. వారిలో జీసూ, జెన్నీ, రోజ్‌లతో పాటు లీసా మనోబల్ ఒకరు. లీసా అసలు పేరు ప్రణ్‌ప్రియా మనోబల్‌. థాయ్‌లాండ్‌లో పుట్టి, పెరిగిన లీసా.. 2010లో 15ఏళ్లు కూడా నిండని చిన్న వయస్సులోనే వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లేబుల్‌లో చేరింది. అప్పటికి ఆమె వయస్సు 13ఏళ్లు.అలా థాయ్ లాండ్ నుంచి లీసా దక్షిణ కొరియాకు మారిపోయింది. 2016 నుంచి బ్లాక్‌పింక్‌లో సింగర్‌గా కొనసాగుతోంది. బ్లాక్‌పింక్‌లో స్టార్‌డమ్‌, వరల్డ్‌వైడ్‌ ఫ్యాన్‌ఫాలోయింగ్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌ల లిస్ట్‌.. ఇలా దేంట్లో చూసినా లీసా వెరీ వెరీ స్పెషల్. ఆమెకుండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. గ్రూప్ లో ఉండే జీసూ, జెన్నీ, రోజ్‌ కంటే లీసాకే ఎక్కువ క్రేజ్.

అటువంటిది గత కొంతకాలంగా బ్లాక్‌పింక్‌ ఈవెంట్లలో లీసా కనిపించట్లేదు. లీసా లేకపోవటం అభిమానులకు నచ్చలేదు. ఆమె ఎందుకు బ్లాక్ పింక్ లో కనిపించట్లేదనే అందరి నోటా వినిపిస్తోంది. లీసాను బివిల్‌గరి ఫ్యాషన్‌వీక్‌తో పాటు మరికొన్ని షోస్‌ల్లో కూడా లీసాను వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రమోట్‌ చేయలేదు. మిగతా ముగ్గురు సింగర్స్‌ జీసూ, జెన్నీ, రోజ్‌లను మాత్రం ప్రతీదానికి అనుమతిస్తున్నారు. దీంతో లీసా అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చింది. లీసా ఎందుకు టీమ్ లో కనిపించట్లేదని ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనికి సమాధానం చెప్పి తీరాలనే డిమాండ్ కూడా రావటంతో వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పందిస్తు..కరోనా నిబంధనల వల్లే లీసాను అనుమతించడం లేదంటూ వివరణ ఇచ్చుకుంది. దీంతో అభిమానుల్లో మరింతగా ఆగ్రహం వెల్లువెత్తింది. తీవ్రంగా మండిపడ్డారు.

Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

మిగతావారికి లేని నిబంధనలు కేవలం లీసాకు మాత్రమే ఎందుకు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. లీసాకు మద్దతుగా ఆమె ఫ్యాన్స్‌.. #justiceforlisa, #YGLetLisaDoHerWork హ్యాష్‌ట్యాగ్‌లను వెల్లువెత్తిస్తున్నారు. స్వదేశం నుంచి ఫ్రాన్స్‌కు లీసాను రప్పించడం, పారిస్‌ ఫ్యాషన్‌​ వీక్‌లో అవకాశం ఇవ్వకపోవం ఇటువంటివన్నీ లీసాకు అవమానమేనంటున్నారు ఆమె అభిమానులు.మిగతా సింగర్స్‌ విషయంలో లేని ఆంక్షలు, అభ్యంతరాలు.. లీసాకు మాత్రమే ఎందుకని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌లో పోస్టులతో ఉప్పెన్ క్రియేట్ చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలేకాకుండా..లీసా సొంత ఏజెన్సీ సూచనల మేరకే లీసా దూరంగా ఉంటోందని చెప్పుకొస్తున్నారు నిర్వాహకులు.

లీసా వివాదంలో సీన్ లోకి రేసిజం!
లీసా విషయంలో పెరుగుతున్న ఈ వివాదంలోకి రేసిజం ప్రస్తావన తీసుకొస్తున్నారు కొంతమంది. దక్షిణ కొరియా వ్యాపారవేత్త, వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో వాంగ్‌బోక్‌యుంగ్‌ జాత్యాహంకారంతో లీసాను పక్కనపెట్టిందని ఆరోపిస్తున్నారు.లీసా థాయ్‌లాండ్‌ ర్యాపర్‌ కావడమే ఈ వివక్షకు కారణమంటున్నారు. ఈ క్రమంలో వాంగ్‌బోక్‌ మీద RIP పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తన షేర్లు పతనం కాకుండా ఉండటానికి #justiceforlisa ట్వీట్లను డిలీట్‌ చేయిస్తోందన్న వాదన తెర మీదకు రావటంతో లీసా ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు. ప్రశ్నలతోను,విమర్శలతోను ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మ్యూజిక్‌ కేటగిరీలోనే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు రాగా..మొత్తం నాలుగు మిలియన్లకుపైగానే లీసాకు మద్దతు తెలుపుతు ట్వీట్లు పోస్ట్‌ అవుతున్నాయి.

Read more : 3 Day Work Week: ఆ కంపెనీ ఉద్యోగులకు వారానికి మూడే వర్కింగ్ డేస్..

ఆల్బమ్ రిలీజ్ తో రికార్డులు కొల్లగొట్టిన లీసా..
వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో లీసాకు విభేదాలు వచ్చాయని సోషల్‌ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో లీసా ఆమె బ్లాక్‌పింక్‌ నుంచి బయటకు వచ్చేస్తుందనీ కొంతమంది కాదు ఇప్పటికే వచ్చేసిందంటూ ఎవరికి తోచింది వారు రాసిపారేస్తున్నారు. కానీ..వీటిపై లీసా ఏమాత్రం స్పందించలేదు. ఈక్రమంలో ఈ వార్తలకు మరింత ఊతమిస్తు లీసా సెప్టెంబర్‌లో లాలిసా పేరుతో సోలో ఆల్బమ్‌ విడుదుల చేసింది. ఈ ఆల్బమ్ కాపీలు సౌత్‌ కొరియాలో ఏడున్నర లక్షలు హాట్ కేకుల్లా అమ్ముడై రికార్డు సృష్టించాయి. ఆమె గ్రూపులో ఉన్నా సోలోగా ఉన్నా లీసా క్రేజ్ అని తెలిపే రేంజ్ లో ఆల్బమ్ కాపీలు అమ్ముడైపోవటంతో ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. అంతేకాదు యూట్యూబ్‌ ఒక్కరోజులో 76.3 మిలియన్‌ల వ్యూస్‌ రాబట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది లీసా. ప్రస్తుతం ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్న క్రమంలో ఆమె ఇంకా బ్లాక్‌పింక్‌లోనే కొనసాగుతుందా? లేకపోతే బయటకు వచ్చేస్తుందా?లేదా ఇప్పటికే వచ్చేసిందా? అనేదానిపై మాత్రం క్లారిలీ లేదు.మరి ఈ వివాదాలకు లీసా చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి.