Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు

క్రమ శిక్షణ కోసం ఉపాధ్యాయులు విద్యార్దులను మందలిస్తే అది వారిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు

Disciplining A Student Not Abetment To Suicide (1)

Disciplining a Student not Abetment to Suicide: స్కూల్లో విద్యాబుద్ధులు చెప్పే మాస్టారు మందలిస్తే అది ఆ విద్యార్ధిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. స్కూల్లో మాస్టారు తిట్టినందు వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కోర్టును ఆశ్రయించిన కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. స్కూల్లో టీచర్ మందలించినంత మాత్రాన దాన్ని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా చూడలేమని మంగళవారం (అక్టోబర్ 5,2021) సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అనంతరం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 306 వర్తించజాలదని పేర్కొంటు ఈ కేసును జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని నేవ్‌త్‌ గ్రామంలో సెయింట్‌ గ్జేవియర్స్‌ స్కూల్‌లో 9th class చదువుతున్న ఓ విద్యార్థి 2018 ఏప్రిల్ 26న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో..స్కూల్లో పీఈటీ వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన మందలించటం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సదరు విద్యార్ధి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more : సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

స్కూల్లో పీఈటీగా పనిచేసే జియో తన కొడుకుని మానసికంగా వేధించాడని అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని సూసైడ్‌ నోట్‌లో ఈ విషయాన్ని రాశాడని విద్యార్ధి తల్లి పోలీసులకు రాసిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్ధి ఆత్మహత్య మూడు పేజీల లేఖలో..మొదటి పేజీలో తను ఆత్మహత్య చేసుకుంటున్నానని..తన వస్తువులన్నీ తన సోదరుడుకి ఇవ్వాలని రాశాడు. రెండో పేజీలో న్యాయం కావాలని, మూడో పేజీలో సీఈటీ జియో సార్‌కు ధన్యవాదాలు అని విద్యార్థి రాసినట్లుగా ఉందని తెలిపారు.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతు పీఈటీ హైకోర్టు ఆశ్రయించగా దాన్ని కోర్టు కొట్టివేసింది. దీంతో విద్యార్ది తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు మంగళవారం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Read more :Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

‘‘దేశంలో ఆత్మహత్యాయత్నం సెక్షన్‌ 309 ప్రకారం నేరంగా పరిగణిస్తాం. సెక్షన్‌ 306 ప్రకారం..ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి పదేళ్ల వరకూ జైలు, జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థిని మందలించడంపై ఎటువంటి చట్టాలు లేవు. కానీ విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్ధుల్ని మందలించటం అనేది నేరం కాదని తెలిపింది. విద్యార్దులకు క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపాధ్యాయుడు..స్కూల్ అథారిటీలు ఉపేక్షించవు. అది ఉపాధ్యాయుడి బాధ్యత మాత్రమే కాదు విద్యా హక్కు చట్టం సెక్షన్‌ 24 (ఈ) ప్రకారం తల్లిదండ్రులు, గార్డియన్లతో ఉపాధ్యాయుడు విద్యార్థి హాజరు, క్రమశిక్షణ, చదువు గురించి తెలియజేయటానికి తెలుసుకోవాడటానికి సమావేశం కావాలి. అవి విద్యావిధానంలో ఉండే బాధ్యతలు.

ఇటువంటి విధానంలో విద్యార్థి అస్తమాను క్లాసులకు గైర్హాజరు కావడం..దాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు మందలించడంత సర్వసాధారణమే.ఆ విషయాన్ని ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్‌, తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుమించి ఈ కేసులో పీఈటీ ఏమీ చేయలేదు. అందువల్ల సీఈటీ వేధింపుల వల్లే సదరు విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పలేం. ఇటువంటి ఆరోపణలు సదరు ఉపాధ్యాయుడికి ఆపాదించాల్సిన అవసరం లేదు’’ అంటూ పేర్కొంది సుప్రీంకోర్టు. ఆత్మహత్య అనే పదానికి ఐపీసీలో నిర్వచనం లేదని, సాధారణ నిఘంటువులో మాత్రం స్వీయహత్య (సెల్ఫ్‌ కిల్లింగ్‌ ) అని ఉంటుందని పేర్కొంది. అంటే తననుతాను చంపుకొనే లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించిన మార్గాలతో
సంబంధం లేకుండా చేపట్టిన చర్యగా ధర్మాసనం అభివర్ణించింది.