3 Day Work Week: ఆ కంపెనీ ఉద్యోగులకు వారానికి మూడే వర్కింగ్ డేస్..

మా కంపెనీలో ఉద్యోగులు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అని బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ప్రకటించింది.

3 Day Work Week: ఆ కంపెనీ ఉద్యోగులకు వారానికి మూడే వర్కింగ్ డేస్..

It Comm 3 Days Work Week

3 Day Work Week In Fintech company Slice : ఐటీ ఉద్యోగం. చక్కటి జీతం. వారానికి 5రోజులే వర్కింగ్ డేస్. కానీ ఓ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి మా కంపెనీ ఉద్యోగులు వారానికి కేవలం మూడు అంటే మూడు రోజులే పనిచేస్తే సరిపోతుంది అంటూ ప్రకటించింది. టెక్నాలజీ ఎంత విస్తరిస్తుంటే అవకాశాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీస్​ నేర్చుకున్న వారికి ఐటీ కంపెనీలు పెద్ద పీఠ వేస్తున్నాయి. వారి కోసం భారతదేశంలోని టెక్‌ స్టార్టప్స్‌లో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బిలియన్ల కొద్ది డాలర్లు గుమ్మరిస్తున్నారు. అంటే వారానికి నాలుగు రోజులు ఖాళీయే.

Read more :Freshworks : కోటీశ్వరులైపోయిన ఇండియన్ కంపెనీ ఉద్యోగులు..‘శిఖ‌రాన్ని అందుకున్నాం..ఆకాశాన్ని తాకుతాం’..అంటున్న సీఈవో

బెంగళూరులోని ఫిన్‌టెక్‌ కంపెనీ స్లైస్‌ కంపెనీ తమ కంపెనీలో వారంలో మూడు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అంటూ ప్రకటించింది. అలాగని జీతంలో కోతలు కూడా ఏమీలేవు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ రేటులో 80 శాతం జీతంగా ఇస్తామంటూ స్లైస్‌ కంపెనీ ప్రకటించింది. దీని కోసం స్లైస్ కంపెనీ ఏమంటోందంటే..ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ టైమ్ లభించటంతో తమ ఇంట్రెస్టులు,అభిరుచులను ఆస్వాదించవచ్చని తెలిపింది. స్లైస్ కంపెనీలో ఇప్పటికే 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఈక్రమంలో వచ్చే మూడు ఏళ్లలో మరింతమంది ఉద్యోగుల్ని నియమించుకోవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇటువంటి ఆఫర్ ను ప్రకటిచిందీ కంపెనీ. రానున్న మూడేళ్లలో 1,000 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను నియమించే ఆలోచనలో ఉంది స్లైస్ కంపెనీ. ఈ మూడు రోజుల పనితోనూ ఉద్యోగులు పూర్తి ప్రయోజనాలు, పూర్తిజీతం పొందవచ్చు.

ఈ ఆఫర్ పై స్లైస్ కంపెనీ వ్యవస్థాపకుడు, యువ ఎంటర్ ప్రెన్యూర్ 28 ఏళ్ల రాజన్ బజాజ్ మాట్లాడుతు..ఫ్యూచర్ లో ఇటువంటి పద్ధతే ఉంటుంది. ఏ ఉద్యోగి కూడా ఒకే ఉద్యోగానికి కట్టుబడి ఉండాలని కోరుకోవటంలేదని తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాల్లో మిగిలిన సమయంలో కొత్త కోర్సులు నేర్చుకోవచ్చనీ..లేదా వారి టాలెంట్ నిరూపించుకోవటానికి స్టార్టప్​ సంస్థను నెలకొల్పవచ్చని, కో-ఫౌండర్‌ను అన్వేషించుకోవచ్చని రాజన్‌ సూచిస్తున్నారు.

Read more : Blood Thinners: రక్తాన్ని పలుచగా చేసే ఇవి..50 శాతం కరోనా మరణాలు తగ్గిస్తున్నాయి : తాజా పరిశోధనలో వెల్లడి

కాగా..మూడు రోజుల వర్కింగ్ డేస్ అనే కాన్సెప్ట్‌ అనేది చాలాకాలం నుంచి ఉంది. 1926లో మొదటిసారి హెన్రీ ఫోర్డ్ ఐదు రోజుల పని దినాల విధానాన్ని ప్రవేశపెట్టారు. అలా వర్కింగ్ డేస్ తగ్గించడం వల్ల ఉత్పాదకతలో తరుగుదల ఏమైనా ఉంటుందా? అనేకోణంలో ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. అలాగే పలు దేశాలు..పలు కంపెనీలు నాలుగు రోజుల పనిదినాలపై ప్రయోగాలు చేశాయి. అంటే కొన్ని సంత్సరాలపాటు నాలుగురోజుల వర్కింగ్ డేస్ తో పనిచేస్తు..బేరీజు వేసుకున్నాయి. కానీ తక్కువ పనిదినాలతో చక్కటి ఆదాయాలు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

Read more : Engineers Thela : దమ్మున్న ఇంజనీర్ల దమ్ బిర్యానీ..ఓ వైపు ఉద్యోగం..మరోవైపు వ్యాపారం

తక్కువ పని రోజులతో ఉద్యోగి ఉత్పాదకత (Productivity)పెరుగుతోందని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇటువంటి విధానానికి ఐర్‌ల్యాండ్‌, ఐస్‌ల్యాండ్‌ వంటి దేశాలు మొగ్గుచూపుతున్నాయి. అమెజాన్ కంపెనీ 2018నుంచి కంపెనీ సెలెక్ట్ చేసిన కొంతమంది ఉద్యోగులకు వారానికి నాలుగు రోజుల వర్కింగ్ డేస్ అమలు చేస్తోంది. అలాగే వర్కింగ్ డేస్ తగ్గించటానికి భారత్ సరిహద్దు దేశమైన చైనా కూడా ఆ దిశగా యత్నాలు చేస్తోంది.సిలికాన్ వ్యాలీ తరహాలోనే ఇండియన్‌ స్టార్టప్‌ రంగం కూడా ఇటువంటి విధానం అమలు చేయటానికి యత్నిస్తోంది. ఇంజినీర్ల వేతనాలు గత మూడేళ్లలో మూడు రెట్లు పెరిగాయని రాజన్‌ బజాజ్‌ అంటున్నారు. నిపుణులైన ఉద్యోగుల కోసం కంపెనీలు యుద్ధాలే చేస్తున్నాయి. అటువంటివారిని దక్కించుకోవటానికి భారీ భారీ జీతాలిచ్చి నియమించుకుంటున్నాయి.

దాదాపు రెండు సంవత్సరాలు ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు క్రమంగా ఆఫీసు దారిపడుతుండటంతో స్లైస్‌ సంస్థ సోమవారం నుంచి త్రీ-డే వర్క్ ప్రారంభించింది. 2016లో ప్రారంభమైన స్లైస్‌ సంస్థ యువతకు క్రెడిట్‌ కార్డులు అందజేస్తోంది. నిమిషం వ్యవధిలో క్రెడిట్‌ కార్డు అంటూ 2019లో ఫిజికల్‌ కార్డు లాంచ్ చేసింది. గత నెల స్లైస్‌ 110,000 కార్డులు జారీ చేసింది.