Blood Thinners: రక్తాన్ని పలుచగా చేసే ఇవి..50 శాతం కరోనా మరణాలు తగ్గిస్తున్నాయి : తాజా పరిశోధనలో వెల్లడి

రక్తాన్ని పలుచన చేసే కొన్ని మందుల ద్వారా కరోనా మరణాలను 50 శాతం తగ్గించవచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

Blood Thinners: రక్తాన్ని పలుచగా చేసే ఇవి..50 శాతం కరోనా మరణాలు తగ్గిస్తున్నాయి : తాజా పరిశోధనలో వెల్లడి

Blood Thinners

Updated On : October 5, 2021 / 2:20 PM IST

Blood Thinners ..Reduce Covid Deaths By 50% : ఏడాదిన్నర నుంచి కరోనా జనాలను ముసుగు తీయనీయట్లేదు.వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్క్ మస్ట్ అంటున్నారు నిపుణులు. సెకండ్ వేవ్ లో ఎంతోమంది ప్రాణాలకు కోల్పోయారు. థర్డ్ వేవ్ వస్తుందని కొంతమంది లేదని కొంతమంది అంటున్నారు. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకున్నా అది కేవలం ఆరునెలల వరకే పనిచేస్తుందంటున్నారు. యాంటీ-కరోనా వ్యాక్సిన్లు ఫైజర్, బయోటెక్‌లు వేయించుకున్న ఆరు నెలల తర్వాత 47 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. యుఎస్‌లో బూస్టర్ షాట్‌ల అవసరం గురించి వివరిస్తూ.. ఆరోగ్య సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి. ఈ డేటా లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఇదిలా ఉంటే మరి కరోనా మరణాలను తగ్గించే అవకాశాలే లేవా? అంటే ఉన్నాయని అంటోంది ఓ అధ్యయనం. కరోనా మరణాలను 50 శాతం తగ్గించవచ్చంటున్నారు.మరి ఎలా అంటే..బ్లడ్‌ థిన్నర్లు అంటే రక్తాన్ని పలుచగా చేసే ఈ మెడిసిన్స్ ద్వారా 50శాతం కోవిడ్‌ మరణాలను అడ్డుకోవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైందంటున్నారు యూఎస్ పరిశోధకులు. ఈ బ్లడ్‌ థిన్నర్ల ద్వారా కరోనా మరణాలను అడ్డుకోవచ్చని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Read more : Pfizer/BioNTech Vaccine: ఆరు నెలల్లో వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుంది.. డెల్టా వేరియంట్‌తో ప్రమాదమే!

అమెరికాలోని 60 ఆస్పత్రుల్లో 2020 మార్చి 4 నుంచి ఆగస్టు 27 వరకు, 6,195 మంది రోగులపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 90 రోజలు పాటు యాంటీ కోయాగ్యులేషన్‌ థెరపీ ఇచ్చి ఈ వివరాలను సేకరించారు. రక్తం గడ్డకట్టకుండా..రక్తాన్ని పలుచగా చేసే మందులతో కరోనా మరణాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా వల్ల ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డం కట్టి ఆ తరువాత సదరు బాధితుడు మరణించే ప్రమాదం ఏర్పడుతోంది. కానీ అలా రక్తం గడ్డకట్టకుండా ఉంటే మరణ ప్రమాదం తప్పినట్లే. అలా రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి ఈ బ్లడ్‌ థిన్నర్లు ఉపయోగకరంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ బట్ల థిన్నర్ల వల్ల మరణ ప్రభావం తగ్గుతోందని వెల్లడించారు. కోవిడ్‌ సోకే నాటికే బ్లడ్‌ థిన్నర్లు వాడుతున్న వారిలో కరోనా ప్రమాదం, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం, మరణాలు గణనీయంగా తగ్గుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు.

Read more : Eye Treatment With IPhone : ‘ఐ’ ఫోన్‌13తో ‘ఐ’ ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్..

బ్లడ్‌ థిన్నర్లు వాడుతున్న వారిలో 43శాతం మంది ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేకుండానే కరోనాను జయించారని పరిశోధకుల్లో వెల్లడైంది. అలాగే కొన్ని కేసుల్లో మరణాలు సంభవించినా అవి చాలా తక్కువేనని అలా కోవిడ్ మరణాలు దాదాపు సగం అంటే 50 శాతం తగ్గినట్లుగా తేలింది. గుండె కొట్టుకోవడంలో అసమానతలు ఉండటం,ఊపిరితిత్తులు–కాళ్లలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉన్నవారికి సాధారణంగా వైద్యులు బ్లడ్‌ థిన్నర్లు ఇస్తుంటారు.

బ్లడ్‌ థిన్నర్లను ఇస్తే కరోనా మరణాలు తగ్గించవచ్చు..
కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన ప్రారంభంలో బాధితులకు బ్లడ్‌ థిన్నర్లను ఇస్తే కరోనా తీవ్రతను తగ్గించే అవకాశాలు చాలా వరకు తగ్గుతున్నాయని మిన్సెసొటా యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సామెహ్‌ హొజాయెన్‌ వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా చాలా మెడికల్‌ సెంటర్లు ప్రస్తుతం ఈ పద్ధతిని వినియోగిస్తున్నాయని ఆమె వెల్లడించారు. ఈక్రమంలో తమ టీమ్ ఈజిప్ట్‌తో పాటు పలు దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధనను నిర్వహిస్తోందని తెలిపారు.