Pfizer/BioNTech Vaccine: ఆరు నెలల్లో వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుంది.. డెల్టా వేరియంట్‌తో ప్రమాదమే!

యాంటీ-కరోనా వ్యాక్సిన్లు ఫైజర్, బయోటెక్‌లు వేయించుకున్న ఆరు నెలల తర్వాత 47 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.

Pfizer/BioNTech Vaccine: ఆరు నెలల్లో వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుంది.. డెల్టా వేరియంట్‌తో ప్రమాదమే!

Vaccine

Pfizer/BioNTech Vaccine: యాంటీ-కరోనా వ్యాక్సిన్లు ఫైజర్, బయోటెక్‌లు వేయించుకున్న ఆరు నెలల తర్వాత 47 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. యుఎస్‌లో బూస్టర్ షాట్‌ల అవసరం గురించి వివరిస్తూ.. ఆరోగ్య సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి. ఈ డేటా లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడింది.

వ్యాక్సిన్ వేసుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్ ప్రభావం దాదాపుగా అందరిలో తగ్గిందని ఒక అధ్యయనంలో తేలింది. కరోనా ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో 88శాతం వరకు ప్రభావవంతమైన ఫైజర్ వ్యాక్సిన్, బయోటెక్ వ్యాక్సిన్ ఆరు నెలల టీకా తర్వాత 47 శాతం మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుందని, డెల్టా వేరియంట్‌ను తట్టుకునే శక్తి కూడా లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆరు నెలల పాటు వ్యాక్సిన్ సమర్థత 90 శాతంగా కూడా ఉందని, ఈ సమయంలో వ్యాక్సిన్ కారణంగా, కోవిడ్ వచ్చే పరిస్థితి, తీవ్రమైన ప్రమాదం తగ్గిందని చెప్పారు. ఈ సమయంలో కరోనా డెల్టా వేరియంట్ నుంచి కూడా వ్యాక్సిన్ రక్షించబడిందని చెప్పారు. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న ఒక నెల వరకు 93 శాతం వరకు కూడా ప్రభావవంతంగా ఉంటుందని, నాలుగు నెలల్లో దాని ప్రభావం 53 శాతం తగ్గిపోయిందని, ఇతర వేరియంట్‌కు వ్యతిరేకంగా దాని సామర్థ్యం 97 శాతం నుండి 67 శాతానికి తగ్గిందని చెప్పారు.