Freshworks : కోటీశ్వరులైపోయిన ఇండియన్ కంపెనీ ఉద్యోగులు..‘శిఖ‌రాన్ని అందుకున్నాం..ఆకాశాన్ని తాకుతాం’..అంటున్న సీఈవో

అమెరికా స్టాక్ ఎక్స్‌చేంజ్ నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన తొలిభార‌తీయ సాఫ్ట్‌వేర్ యాజ్ ఎస‌ర్వీస్‌ స్టార్ట‌ప్ కంపెనీగా ఫ్రెష్‌వ‌ర్క్స్ నిలిచింది.దీంతో ఈ సంస్థ‌ ఉద్యోగులు కోటీశ్వరులైయ్యారు

Freshworks : కోటీశ్వరులైపోయిన ఇండియన్ కంపెనీ ఉద్యోగులు..‘శిఖ‌రాన్ని అందుకున్నాం..ఆకాశాన్ని తాకుతాం’..అంటున్న సీఈవో

Freshwork

500 Freshworks employees  : స్టార్టప్ గా మొదలైంది. కానీ ఇప్పుడు ఎక్కడ విన్నా ఆసంస్థ పేరు మారుమ్రోగిపోతోంది. దీంతో ఆ సంస్థ ‘‘ఇప్పుడు శిఖ‌రాన్ని అందుకున్నాం.. ఇక ఆకాశాన్ని తాకుతాం’ అంటోంది. అదే ఫ్రెష్‌వ‌ర్క్స్ (Freshworks). కంపెనీ. అమెరికా స్టాక్ ఎక్స్‌చేంజ్ నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన తొలి భార‌తీయ సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ స‌ర్వీస్‌ స్టార్ట‌ప్ కంపెనీ ఫ్రెష్‌వ‌ర్క్స్ నిలిచింది. దీంతో ఈ సంస్థ‌లోని 10 శాతం మంది ఉద్యోగులు అంటే 500 మంది రాత్రికి రాత్రి కోటీశ్వ‌రులైపోయారు.

స్టార్టప్ లతో మొదలైన ఎన్నో కంపెనీలు ఎన్నో ఒడిదుడుల్లో నడుస్తుంటాయి. ప్రాజెక్టుల కోసం నానా పాట్లు పడుతుంటాయి. కానీ 2010లో కేవ‌లం ఆరుగురు ఉద్యోగుల‌తో చెన్నైలో ప్రారంభమైన ఈ ఫ్రెష్ వర్క్స్ సంస్థ‌.. ఇప్పుడు అందరి నోటా అదే మాటగా నిలిచింది. చిన్నగా మొదలై అంతర్జాతీయ గుర్తింపు స్థాయికి చేరింది. దీంతో సంస్థ యాజమాన్యంతో పాటు ఉద్యోగుల్లో కూడా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

Read more : Volkswagen : భారత రోడ్లపై ‘వోక్స్‌వ్యాగ‌న్ టైగ‌న్ ఎస్‌యూవీ’ పరుగులు

ఈ సంస్థ విజయంలో భాగంగా గురువారం (సెప్టెంబర్ 23,2021)ఈ సంస్థ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 1300 కోట్ల డాల‌ర్లు దాటింది. అంటే ఇది ఏస్థాయికి చేరుకుందో ఊహించటమేకష్టంగా ఉంది. దీంతో ఈ సంస్థ త‌ర‌ఫున ఇండియాలో వర్క్ చేస్తున్న 500 మంది ఉద్యోగులు కోటీశ్వ‌రులైపోయారు. వీళ్ల‌లో 70 శాతం మంది 30 ఏళ్ల‌లోపు వాళ్లే కావటం విశేషం. 30 ఏళ్లు అంటే చాలామంది ఇంకా కెరీర్ ప్రారంభదశలోనే ఉంటారు. కానీ ఫ్రెష్ వర్క్స్ సంస్థ ఉద్యోగులు మాత్రం పీక్స్ లెవెల్ కు వెళ్లిపోయారు అతికొద్ది కాలంలోనే. తొలిసారి ప‌బ్లిక్ ఆఫ‌రింగ్ (ఐపీఓ)కు వెళ్లిన ఫ్రెష్‌వ‌ర్క్స్ షేరు ధ‌ర ఊహించిన‌దాని కంటే భారీ విలువతో అందరి దృష్టిని ఆకర్షించింది.

దీంతో ఎంప్లాయీ స్టాక్ ఓన‌ర్‌షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ) కింద సంస్థ షేర్లు క‌లిగి ఉన్న ఉద్యోగులు భారీగా లాభాల్లో పడ్డారు. దీని గురించి ఫ్రెష్‌వ‌ర్క్స్ కోఫౌండ‌ర్‌, సీఈవో గిరీష్ మాతృబూత‌మ్ మాట్లమాట్లాడుతు..‘ తమ కంపెనీకి వచ్చిన లాభాల్ని సంస్థ స్థాపించినవారే తీసుకోకుండా..ఉద్యోగుల్ని లాభాల్లో భాగస్వాముల్ని చేయాలనే ఉద్ధేశ్యంతో మేం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉద్యోగులంతా లాభపడ్డారని తెలిపారు. కంపెనీ కోసం కష్టపడివారికి కూడా కూడా లాభాలు అందించాలనే మా ఉద్ధేశ్యం..మా కంపెనీ సిద్ధాంతం అని తెలిపారు. బుధ‌వారం ఇష్యూ ప్రైస్ కంటే 32 శాతం అధికంగా 47.55 డాలర్ల ద‌గ్గ‌ర ఫ్రెష్‌వ‌ర్క్స్ షేర్లు ట్రేడ‌వుతున్నాయి.

శిఖ‌రాన్ని అందుకున్నాం.. ఆకాశాన్ని తాకుతాం..: CEO 

ఫ్రెష్‌వ‌ర్క్స్ సంస్థ సీఈవో గిరీష్ ఓ వినూత్న వ్యక్తి.తన ఉద్యోగుల ఉల్లాసమే తమ సంస్థకు లాభం అని నమ్మే వ్యక్తి. గిరీష్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు వీరాభిమాని. ఆయనమైన తన అభిమానాన్ని చూపించుకోవటంలో భాగంగా తన ఉద్యోగులు ఉల్లాసం కోసం ర‌జ‌నీకాంత్ కొత్త సినిమా రిలీజైన‌ప్పుడ‌ల్లా ఉద్యోగుల‌కు సెల‌వు ఇస్తారు.రజనీకాంత్ సినిమాల్ల డైలాగ్స్ అంటే కూడా గిరీష్ కు చాలా చాలా ఇష్టం. ఆ డైలాగ్స్ లో వాస్తవాల్ని వెతుక్కుంటారాయన. వాటిని పాటిస్తారుకూడా. అలా రజనీకాంత్ త‌మ సంస్థ ఇంత పెద్ద స‌క్సెస్ కారణం అన్నట్లుగా మాట్లాడారు. తమ కంపెనీ సక్సెస్ సాధించిన త‌ర్వాత అదే ర‌జ‌నీకాంత్ మూవీ న‌ర‌సింహ‌లోని ఓ పాట‌నే త‌నకు ప్రేర‌ణ అని గిరీష్ చెప్పారు. అదే ఆయనకు రజనీ అంటే ఎంత ఇష్టమో ఇక ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

Read more : Bajaj : హైదరాబాద్‌‌లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు, ఎక్కడో తెలుసా

సింహం న‌డిచే దారిలో వెళ్లు.. శిఖ‌రాన్ని తాకు.. అక్క‌డితో ఆగ‌కుండా ఆకాశాన్ని కూడా అందుకో అన్న ఆ పాట‌లోని ప‌దాలే త‌న‌కు ప్రేర‌ణ‌గా నిలిచాయ‌ని ఆయ‌న అన్నారు. ఇప్పుడు శిఖ‌రాన్ని తాకాం.. ఇంత‌టితో ఆగ‌కుండా ఆకాశాన్నీ అందుకుంటామ‌ని విశ్వాసంతో చెబుతున్నారు సీఈవో గిరీష్.