Volkswagen : భారత రోడ్లపై ‘వోక్స్‌వ్యాగ‌న్ టైగ‌న్ ఎస్‌యూవీ’ పరుగులు

వోక్స్‌వ్యాగ‌న్ టైగ‌న్ ఎస్‌యూవీని భారత రోడ్లపై పరుగులు తీయనుంది. ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శించిన టైగర్ ఎస్‌యూవీని భారత్ లో లాంఛ్‌ చేసింది.

Volkswagen : భారత రోడ్లపై ‘వోక్స్‌వ్యాగ‌న్ టైగ‌న్ ఎస్‌యూవీ’ పరుగులు

Volkswagen

Volkswagen : వోక్స్‌వ్యాగ‌న్ టైగ‌న్ ఎస్‌యూవీని భారత రోడ్లపై పరుగులు తీయనుంది. ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శించిన టైగర్ ఎస్‌యూవీని భారత్ లో లాంఛ్‌ చేసింది. త్వరలో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్ షోరూం ధర రూ.10.5 లక్షలుగా ఫిక్స్ చేసింది కంపెనీ. ఇక పండుగ సీజన్ కావడంతో టైగన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది వోక్స్‌వ్యాగ‌న్. ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న హ్యుండాయ్ క్రెటా, స్కోడా కుష‌క్‌, కియా సెల్టోస్‌, ఎంజీ ఆస్ట‌ర్‌ల‌కు టైగ‌న్ దీటైన పోటీ ఇస్తుంద‌ని భావిస్తున్నారు.

Read More : Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే!

టైగ‌న్‌ను వోక్స్‌వ్యాగ‌న్ భార‌త్ మార్కెట్‌కు అనుగుణంగా డెవ‌లప్ చేసింది. టైగ‌న్ బుకింగ్‌లు ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఇప్ప‌టివ‌ర‌కూ 12,221 ప్రీఆర్డ‌ర్లు ల‌భించాయి. 10.1 ఇంచ్ ట‌చ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టం, డ్రైవింగ్ బిహేవియ‌ర్‌, లైవ్ ట్రాకింగ్‌, వైర‌ల్‌లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు వైర్‌లెస్ మొబైల్ చార్జింగ్ ప్యాడ్‌, ఆటోమేటిక్ ఏసీ, రెడ్ యాంబియెంట్ లైటింగ్‌, ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోడిమ్మింగ్ రియ‌ర్‌వ్యూ మిర్ర‌ర్‌, క్రూయిజ్ కంట్రోల్‌ వంటి ఫీచ‌ర్లు ఆక‌ట్టుకుంటాయి.

Read More : Aatmanirbhar Bharat: ప్రపంచంలోనే అతిపెద్ద OLA ప్లాంట్‌లో 10వేల మంది మహిళలకు ఉద్యోగాలు

ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, మ‌ల్లీ కొలిజ‌న్ బ్రేక్స్‌, హిల్ హోల్డ్ కంట్రోల్‌, రియ‌ర్‌వ్యూ కెమెరా, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, టైర్ ప్రెజ‌ర్ డిఫ్లేష‌న్ వార్నింగ్ వంటి ఫీచ‌ర్లతో టైగ‌న్ అందుబాటులో ఉంది.