ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా ఓట్ల వివరాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

andhra pradesh election 2024 result: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. అయితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈసీ వివరాల ప్రకారం టీడీపీకి 1.53 కోట్లు, వైసీపీకి 1.32 కోట్ల ఓట్లు పోలయ్యాయి. జనసేన పార్టీకి 28 లక్షలు, బీజేపీకి 9.5 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 5.8 లక్షల ఓట్లు దక్కించుకుంది.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మొత్తం 55.43 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి 45.60 శాతం, వైసీపీకి 39.37 శాతం, జనసేన 8.53 శాతం, బీజేపీకి 2.83, కాంగ్రెస్ పార్టీకి 1.73, నోటాకు 1.09 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీకి 3 శాతం అదనంగా ఓట్ షేర్ పెరిగింది. 2019 ఎన్నికల్లో జనసేన 5.53 శాతం ఓట్లు దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో ఓట్ షేర్ పెరగడంతో గుర్తింపు కలిగిన పార్టీగా జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు రానుంది.

Also Read: జగన్ ఓటమికి ప్రధాన కారణం అదే.. చంద్రబాబు గుణపాఠం నేర్చుకోవాలి: సీపీఐ నారాయణ

ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు
టీడీపీ: 1,53,84,576
వైసీపీ: 1,32,84,134
ఇతరులు: 28,79,555
బీజేపీ: 9,53,977
కాంగ్రెస్: 5,80,613
నోటా : 3,69,320
బీఎస్పీ: 2,04,060

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 70279 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి వంగా గీతపై విజయం సాధించారు. పవన్ కళ్యాణ్‌కు 134394 ఓట్లు, వంగా గీతకు 64115 ఓట్లు వచ్చాయి. భారత చైతన్య యువజన పార్టీ తరపున పోటీ చేసిన ట్రాంజెడర్ తమన్నా సింహాద్రి 247 ఓట్లతో చిట్టచివరి స్థానంలో నిలిచారు.

ట్రెండింగ్ వార్తలు