ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీ దగా పడింది – సీఎం జగన్

Andhra Pradesh Formation Day Celebrations : ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీ రాష్ట్రం దగా పడిందని, గ్రామ గ్రామనా..వేల కిలోమీటర్ల నడిచి..ప్రజల అవసరాలను వారి ఆకాంక్షలను గుర్తించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2020, నవంబర్ 01వ తేదీ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఆఫీసులో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల మంత్రులు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏపీ అవతరించి..నేటికి 64 ఏళ్లు పూర్తయిందని, అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన మహాత్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని 1952, అక్టోబర్ 19వ తేదీన పొట్టి శ్రీరాములు నిరహార దీక్ష చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. మొత్తం 58 రోజుల పాటు దీక్ష కొనసాగిందని, తర్వాత..1952, డిసెంబర్ 15వ తేదీన రాష్ట్రం కోసం అమరులయ్యారని వివరించారు.
1953, అక్టోబర్ 01వ తేదీన ఏపీ రాష్ట్రం అవతరించడం, తెలుగు వారందరి ఉమ్మడి రాష్ట్రంగా 1956, నవంబర్ 01న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనే విషయాలు అందరికీ తెలిసిందేన్నారు. బంగారు భవిష్యత్ కోసం ఎందరో త్యాగమూర్తులు త్యాగం చేశారని, 28 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం పడనంతగా..ఏపీ రాష్ట్రం దగా పడిందన్నారు. బయటివారి కత్తిగాట్లు, సొంత వారి వెన్నుపోట్లతో ఏపీ తల్లడిల్లిందన్నారు. 33 శాతం రాష్ట్రంలో చదువురాని ఉన్నారని వెల్లడించారు.
నేటికి కూడా..దాదాపుగా 85 శాతం ప్రజలు తెల్లరేషన్ కార్డులతో బీపీఎల్ దిగువున ఉన్నారన్నారు. ఒక పంటకు కూడా..కనీసం నీటి సదుపాయం లేకుండా కోటి ఎకరాలు భూములు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఆవాసం కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. పిల్లల చదువుల కోసం, కుటుంసభ్యుల ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం నుంచి దక్కాల్సిన సేవలను దేవరించాల్సిన పరిస్థితులు..ఇలా..ఇంకెన్నో ఉన్నాయని, వీటిని నెరవేర్చాల్సిందన్నారు.
మన గ్రామం, మన వ్యవసాయం, మన కుటుంబం, మన బడి, మన ఆసుపత్రి, మన వైద్య ఆరోగ్య రంగం, మన నీటి పారుదల రంగం..ప్రతొక్క అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి పెట్టామన్నారు. గ్రామాల రూపు రేఖలను ఎలా మార్చాలనే కలతో పరుగెత్తినట్లు, గ్రామం అంటే..గ్రామంలోకి ఓ వ్యక్తి అడుగుపెట్టినప్పుడు గ్రామ సచివాలయం కనిపిస్తుందన్నారు. గ్రామ సచివాలయంలో 10 నుంచి 12 మంది గ్రామ సచివాలయంలో రిపోర్టు చేస్తున్నారని, వాలంటీర్ తో డోర్ డెలివరీ సదుపాయం కల్పించామని, నాడు – నేడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయన్నారు.
వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ పేరిట 51 రకాల మందులు, ఏఎన్ఎం నర్సు, ఆశా వర్కర్ల రిపోర్టింగ్, ఆరోగ్య శ్రీకి రిఫరెల్ పాయింట్ గా 24×7 సేవలు అందిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు, జనతా బజార్ కనిపిస్తున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు ఏవీ చూడకుండా..అవినీతి లేకుండా..వివక్ష లేకుండా…17 నెలల పాటు పాలన సాగింది..సాగుతోందన్నారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చదువు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టామని, గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని సుపరిపాలన అందించేందుకు అడుగులు వేస్తున్నామన్నారు.
ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్న తమ ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయా అని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని ఆలోచించాల్సి అవసరం ఉందన్నారు. కులాల కలుపు మొక్కలు పరువు ప్రతిష్టలను బజారున పడేస్తున్నారని, రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్నాయని, ఈ ధోరలను సమర్థించవచ్చా ? ఆలోచించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ..వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్ మెంట్ మొత్తంగా..తెలుగు జాతి ప్రయోజనాలకు వేరుపురుగుగా మారిందని, ఇలాగే కొనసాగిద్దామనే దానిపై కూడా ఆలోచించాలన్నారు. తన వాడు గెలవలేదు..తమ వాడు అధికారంలో లేడన్న కడుపుమంట నిత్యం అసత్యాలను ప్రచారం చేస్తున్న టీవీలు, పేపర్లు ఈ వ్యవహారాన్ని సమాచార స్వేచ్చ అందామా ? అన్నారు.
సమస్యలున్నాయి..సవాళ్లున్నాయి..అయినా..కర్తవ్యం పవిత్రమైందన్నారు. లక్ష్యం ఉన్నతమైంది కాబట్టి..ప్రజా బలంతో మార్గం వేయగలమని, రాష్ట్రంలోని ఇంటింటి ఆత్మగౌరవం నిలబడేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నట్లు, అవతరణ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.