Andhra Pradesh Schemes(Photo : Google)
Andhra Pradesh – Schemes : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపునేస్తం స్కీమ్స్ కు దరఖాస్తు గడువు పొడిగించింది. వైఎస్సార్ కాపునేస్తం, వాహనమిత్ర పథకాలకు కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసకుంది.
షెడ్యూల్ ప్రకారం వాహనమిత్ర గడువు రేపు (జూలై 25), కాపునేస్తం గడువు నేటితో (జూలై 24) ముగియనుంది. అయితే, ఈ రెండు పథకాలకు కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువును జూలై 27 వరకు పెంచింది జగన్ సర్కార్. కాపు నేస్తం కింద రూ.15వేలు, వాహనమిత్ర కింద ప్రభుత్వం రూ.10వేలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.
Also Read..YS Jagan: అమరావతిపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే నెలలో వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్ కింద జగన్ ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేయనుంది. ఈ స్కీమ్ కు దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 20. అయితే, ఆ తేదీని జూలై 25వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. తాజాగా మరోసారి గడువు తేదీని జూలై 27వ తేదీకి మార్చింది. ఆ డేట్ లోపు గ్రామ సచివాలయాల్లో అప్లయ్ చేసుకోవాలి.
వాహన మిత్ర పథకం కింద సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న రేషన్ కార్డు కలిగిన లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.10వేలను జమ చేస్తుంది. లబ్దిదారులకు ఆధార్, రేషన్ కార్డు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే అమౌంట్ పడుతుంది.
ఇక, వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్ కింద వచ్చే నెలలో లబ్దిదారుల బ్యాంకు అకౌంట్స్ లో డబ్బులు జమ కానున్నాయి. కాపు, బలిక, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45-60ఏళ్ల లోపు మహిళలకు ఈ పథకం కింద రూ.15వేలు జమ కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ తేదీని జూలై 27వ తేదీ వరకు పొడిగించారు. తొలుత ఫీల్డ్ వెరిఫికేషన్, ఆ తర్వాత 6 దశల ధృవీకరణ, అనంతరం సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. చివరగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. లబ్దిదారులు ఈ-కేవైసీ చేశాక వారి ఖాతాల్లో డబ్బుల జమకానున్నాయి.