YS Jagan: అమరావతిపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడా లేదని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

YS Jagan - Amaravati
YS Jagan – Amaravati : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం ఇకపై మన అందరిదని అన్నారు. అమరావతిలో పలు ప్రాంతాల పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న జగన్.. కృష్ణాయపాలెం లే అవుట్ 3లో పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగానే అమరావతి అందరిదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెత్తందారులకు, పేదల ప్రభుత్వమైన వైసీపీకి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు.
పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరూ వారికి ఇళ్లు రాకుండా కోర్టుల్లో కేసులు వేశారని జగన్ అన్నారు. ఇటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడా లేదని చెప్పారు. పేదలకు ఇంటి స్థలాలు అందకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అడ్డుకొనేందుకు యత్నించారని జగన్ తెలిపారు.
వాలంటీర్లు మానవ అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి రాజకీయాలు తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. కాగా, అమరావతిలో పలు ప్రాంతాల పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆర్-5 జోన్ ను సర్కారు కొత్తగా సృష్టించింది.
KTR Birthday Celebrations : విజయవాడలో ఘనంగా మంత్రి కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు