Money (Image Credit To Original Source)
Garuda Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. పేద బ్రహ్మణులు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలన్న లక్ష్యంతో గరుడ పథకాన్ని తీసుకువస్తోంది.
పేద బ్రాహ్మణులు మృతి చెందితే వారి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తారు. త్వరలోనే ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు శ్రీకారం చుట్టనుంది.
ఈ పథకం అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. అమరావతి సచివాలయంలో ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చిరాం ప్రసాద్‌తో ఆమె సమావేశమయ్యారు.
గరుడ పథకం విధివిధానాలపై చర్చించి, వివరాలు తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి సర్కారు ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.