Covid 19 In Ap
Andhra Pradesh Corona : ఏపీ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో ఉంటే..ఇప్పుడు ఆ సంఖ్య వేలకు దాటిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 13 వేల 618 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు 2022, జనవరి 26వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.41 వేల 143 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.
Read More : SpaceX Rocket : చంద్రుడిని ఢీకొట్టబోతున్న భారీ రాకెట్.. ఏడేళ్ల క్రితమే అదృశ్యమై ట్రాక్‌లోకి..!
రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,19,678 పాజిటివ్ కేసు లకు గాను 20,98,790 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. 14,570 మంది మరణించగా… ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,06,318గా ఉందని తెలిపింది. కరోనా కారణంగా తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్టణంలో ఇద్దరు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 8,687 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,22,83,369 శాంపిల్స్ పరీక్షించారు.
Read More : TDP MLC Ashok Babu : నేను చదివింది ఇంటర్మీడియట్.. క్లోజ్ అయిన కేసును వెలికితీయడం ఏంటీ ?
జిల్లాల వారీగా : –
అనంతపురం 1650. చిత్తూరు 493. ఈస్ట్ గోదావరి 961. గుంటూరు 1464. కడప 907. కృష్ణా 803. కర్నూలు 1409. నెల్లూరు 1007. ప్రకాశం 1295. శ్రీకాకుళం 644. విశాఖపట్టణం 1791. విజయనగరం 466. వెస్ట్ గోదావరి 728 : మొత్తం – 13,618
#COVIDUpdates: 26/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,19,678 పాజిటివ్ కేసు లకు గాను
*20,98,790 మంది డిశ్చార్జ్ కాగా
*14,570 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,06,318#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/oV6ha2qL9a— ArogyaAndhra (@ArogyaAndhra) January 26, 2022