TDP MLC Ashok Babu : నేను చదివింది ఇంటర్మీడియట్.. క్లోజ్ అయిన కేసును వెలికితీయడం ఏంటీ ?
ప్రభుత్వం ఎప్పుడూ ఒకటే ఉండదని..మార్పులు వస్తాయని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాచేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి సూర్యనారాయణ ఆలోచించుకోవాలన్నారు. ఇతని గురించి ఓ విషయం ఎవరికీ తెలియదని..

Ashok Babu
TDP MLC Ashok Babu : నేను చదవింది ఇంటర్మీడియట్…బీకాం చదివినట్లు ఫోర్జరీకి పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. తాను ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతుండడంతో ప్రభుత్వం కావాలనే కేసుల పేరిట.. వేటాడుతోందని ఆయన తెలిపారు. కక్షపూరిత చర్యలకు దిగడమేనని.. సీఐడీతో విచారించాల్సిన కేసు కాదని..అయితే సీబీఐతో విచారణ చేయించుకున్నా.. తాను భయపడనని తేల్చిచెప్పారు. ఉద్యోగ పదోన్నతి కోసం ఆయన బీకాం చదివినట్లు ఫోర్జరీకి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై 2022, జనవరి 26వ తేదీ బుధవారం వివరణనిచ్చారు. ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ చదివినట్టు తప్పుడు సమాచారాన్ని పొందుపరిచినట్లు…ప్రచారం జరగడంపై ఆయన మండిపడ్డారు. తాను ఎక్కడా తప్పుడు సమాచారం ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేశారాయన.
Read More : Mom’s Womb : 2వేల ఏళ్ల నాటి మమ్మీ కడుపులో పిండం!
సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో సహచరుడైన సూర్యనారాయణ ఇదే రకమైన అభియోగాలను ప్రచారం చేశారని తెలిపారు. తాను ఈ విషయంలో అప్పుడే స్పందించానని…తర్వాత ఈ అంశం మళ్లీ తెరపైకి రాలేదన్నారు. అయితే..ప్రస్తుతం తాను టీడీపీలో కొనసాగుతున్న క్రమంలో.. ప్రభుత్వం పనిగట్టుకుని కేసుల పేరిట వేటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రలకు పాల్పడుతున్న సూర్యనారాయణ పీఆర్సీ సాధన సమితిలో కొనసాగుతున్నారని వివరించారు. ప్రభుత్వం ఎప్పుడూ ఒకటే ఉండదని..మార్పులు వస్తాయని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాచేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి సూర్యనారాయణ ఆలోచించుకోవాలన్నారు. ఇతని గురించి ఓ విషయం ఎవరికీ తెలియదని, అక్రమ పద్ధతుల్లో ఉత్తీర్ణత సాధించి సస్పెండ్ అయ్యారనే విషయం చాలా మందికి తెలియదన్నారు. అయినా..తాను ఎప్పుడూ ఆయన గురించి మాట్లాడలేదని తెలిపారు. ఎలాంటి తప్పు చేయలేదన్న అశోక్ బాబు… తనకు పార్టీ అండగా ఉంటుందన్నారు.