Mom’s Womb : 2వేల ఏళ్ల నాటి మమ్మీ కడుపులో పిండం!

సిటీ ఎక్స్ రే స్కాన్ సాయంతో పుట్టబోయే బిడ్డ అవశేషాల ఉనికిని, ఈ మమ్మీని మిస్టిరియస్ లేడీ అని పిలుస్తారని తెలిపారు. కానీ..మహిళ ప్రసవంలో చనిపోలేదని, అసలు ఆమె ఎలా చనిపోయిందనే దానిపై...

Mom’s Womb : 2వేల ఏళ్ల నాటి మమ్మీ కడుపులో పిండం!

Mummified

Mummified Fetus Found Inside Mom’s Womb : 2 వేల ఏళ్లనాటి ఈజిప్షియన్ మమ్మీ పొత్తి కడుపులో పిండాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. వార్సా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆ పిండంపై పరిశోధనలు చేయగా..ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మహిళ గర్భం దాల్చిన సందర్భంలో 26 నుంచి 30 వారాల పిండంగా వారు గుర్తించారు. అయితే..మమ్మీలను రసాయన పదార్థాలను పూయడం వల్ల పిండంలోని ఎముకలు నిర్వీర్యం అయిపోయాయని నిర్ధారించారు. పిండంపై ఉన్న మృదు కణజాలంతో ఆ పిండాకృతిని గుర్తించడం కష్టతరంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ఈజిప్షియన్ మమ్మీలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసిన సంగతి తెలిసిందే. సరికొత్త టెక్నాలజీ (మమ్మిఫికేషన్) సాయంతో రెండు వేల నాటి మమ్మి కడుపులో పిండం గుర్తించారు.

Read More : Virat Farewell : రాష్ట్రపతి అంగరక్షకుడు విరాట్ గుర్రానికి భావోద్వేగ వీడ్కోలు.. ప్రేమగా నిమిరిన మోదీ, కోవింద్

సిటీ ఎక్స్ రే స్కాన్ సాయంతో పుట్టబోయే బిడ్డ అవశేషాల ఉనికిని, ఈ మమ్మీని మిస్టిరియస్ లేడీ అని పిలుస్తారని తెలిపారు. కానీ..మహిళ ప్రసవంలో చనిపోలేదని, అసలు ఆమె ఎలా చనిపోయిందనే దానిపై ఎలాంటి వివరాలు తెలియరాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. మమ్మీ సమాధి ప్రస్తుతం శిథిలమైపోయిందని, వారు ఎందుకు పిండాన్ని పొత్తి కడుపులోనే వదిలేశారనేది తెలియరావడం లేదని..ప్రస్తుతం దీనిపై పరిశోధనలు చేయడం జరుగుతోందన్నారు. మమ్మీ శరీరంలోని అంతర్గత భాగాలను తొలగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.