SpaceX Rocket : చంద్రుడిని ఢీకొట్టబోతున్న భారీ రాకెట్.. ఏడేళ్ల క్రితమే అదృశ్యమై ట్రాక్‌లోకి..!

ఏడేళ్ల క్రితం నాటి ఓ భారీ రాకెట్ చంద్రున్ని ఢీకొట్టబోతోంది. సైంటిస్టులు ప్రయోగించిన ఈ రాకెట్ ఇన్నాళ్ల తర్వాత ట్రాక్ తప్పి అపసవ్య దిశలో చంద్రుని దిశగా దూసుకెళ్తోంది.

SpaceX Rocket : చంద్రుడిని ఢీకొట్టబోతున్న భారీ రాకెట్.. ఏడేళ్ల క్రితమే అదృశ్యమై ట్రాక్‌లోకి..!

Spacex Rocket Out Of Contro

SpaceX Rocket : ఏడేళ్ల క్రితం నాటి ఓ భారీ రాకెట్ చంద్రున్ని ఢీకొట్టబోతోంది. సైంటిస్టులు ప్రయోగించిన ఈ రాకెట్ ఇన్నాళ్ల తర్వాత ట్రాక్ తప్పి అపసవ్య దిశలో చంద్రుని దిశగా దూసుకెళ్తోంది. కచ్చితంగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని స్పేస్ ఏజెన్సీలు అంచనాలు వేస్తున్నాయి. అదేగానీ జరిగితే ఏమౌతుందనేది ఆసక్తిగా పరిశీలనలు జరుగుతున్నాయి. సాధారణంగా రాకెట్ పరిశోధనలు కోసం ప్రయోగిస్తారు.. కానీ, ఇలా చంద్రున్ని ఢీకొట్టడమేంటంటే.. అది ఏడేళ్ల పాటు క్షక్షలోనే ఉండి.. కనిపించకుండా అదృశ్యమైపోయింది. ఇప్పటివరకూ ఆ రాకెట్ స్పేస్ జంక్ లోకి కలిసి పోయి ఉండొచ్చులేనని భావించారంతా.. కానీ, ఇప్పుడా ఆ భారీ రాకెట్ దిశ మార్చుకుని చంద్రునివైపుగా ఢీకొట్టబోతోంది.

స్పేస్‌ఎక్స్‌ SpaceX Rocket కంపెనీ ద్వారా ఫాల్కన్‌ 9 బూస్టర్‌ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించారు. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించేందుకు ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి లాంచ్ చేశారు. మొదటి దశలో రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. రెండో దశలో ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. ఫాల్కన్‌ 9 బూస్టర్‌ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్ష్యలో పయనిస్తోంది. అప్పటినుంచి అదుపు తప్పి జాడ లేకుండా పోయింది. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఊహించనిరీతిలో ఈ రాకెట్‌ ట్రాక్‌ ఎక్కింది.

మార్చి 4వ తేదీన రాకెట్ క్రాష్ అయ్యే ఛాన్స్…
చంద్రుడిపైకి క్రాష్‌ దిశగా దూసుకెళ్తుంది. నాసా అంచనా ప్రకారం.. మార్చి 4వ తేదీన ఈ రాకెట్ క్రాష్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించింది. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలోకి వెళ్లింది. దాంతో రాకెట్‌ పని అంతేనని సైంటిస్టులు ఆలోచించడం మానేశారు. ఏడేళ్ల తర్వాత చంద్రుడి వైపు కక్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువైన ఈ పాల్కన్‌ 9 బూస్టర్‌ రాకెట్‌.. గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు దూసుకెళ్తోంది.


నాసా లునార్‌ ఆర్బిటర్ సహా భారత్‌ చంద్రయాన్‌-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్‌ ల్యాండ్‌ను అతి సమీపంలోనే గమనించనున్నాయి. ఈ క్రాష్‌ ల్యాండ్‌తో ఏం జరగబోతుందనే ఆసక్తిగా మారింది. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఈ క్రాష్‌ల్యాండ్‌ను అక్కడ పరిస్థితులను పరిశీలించనున్నారు. 2009లో నాసా ఓ రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ ల్యాండ్ చేసింది. పాల్కన్‌ విషయంలో మాత్రం చంద్రుడి ఉపరితలంపైకి ఢీకొట్టబోతోంది. చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టడం ద్వారా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని, దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతరిక్ష పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Virat Farewell : రాష్ట్రపతి అంగరక్షకుడు విరాట్ గుర్రానికి భావోద్వేగ వీడ్కోలు.. ప్రేమగా నిమిరిన మోదీ, కోవింద్