×
Ad

మొంథా తుపాను వేళ వారు ఇలా చేస్తున్నారు.. అలాంటి వారిపై చర్యలు ఉంటాయి: హోంమంత్రి అనిత

తుపానుకి ముందు, తుపాను తర్వాత పరిస్థితి ఏంటి అనేది అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. 13 ఎస్డీఆర్‌ఎఫ్, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Montha Cyclone: తుపాన్ ప్రభావం కోస్తా జిల్లాలో ఎక్కువగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నాలుగు రోజుల నుంచి ప్రభుత్వం అన్ని పరిశీలిస్తోందని చెప్పారు. 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అన్నారు.

సోషల్ మీడియా ద్వారా కొంత మంది తుపానుపై ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రజలు అవసరం లేకుండా ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అన్నారు. ఎక్కువ ప్రభావం ఉండే జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

తుపానుపై సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని అని తెలిపారు. తుపానుకి ముందు, తుపాను తర్వాత పరిస్థితి ఏంటి అనేది అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. 13 ఎస్డీఆర్‌ఎఫ్, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. (Montha Cyclone)

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అనిత చెప్పారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని తీసివేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు.

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అనిత సూచించారు. ఇప్పటికే అధికారులు అంత అప్రమత్తంగా ఉన్నారు. ఏది వచ్చినా ఎదురుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.