Vizagకు కొత్త హంగులు.. Casino boats, shipsల కోసం ప్లాన్లు

Vizagకు కొత్త హంగులు.. Casino boats, shipsల కోసం ప్లాన్లు

vizag

Updated On : October 5, 2020 / 10:16 AM IST

Vizag మరో గోవా తరహాలో డెవలప్ కానుంది. విదేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. స్టేట్ ఎకానమీ పెంచుకోవటానికి ఏపీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుందా అనేంతలా పరిస్థితులు మారిపోతున్నాయి. నేషనల్ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా.. చాలా తక్కువ కాలంలోనే వైజాగ్ తీరంలో Casino boats.. ships రాబోతున్నాయి.

ఏపీ రాష్ట్రం వెంబడి సముద్రతీరం 975 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీనిని ఉపయోగించుకుని సొమ్ములు రాబట్టుకోవాలని సీఎం జగన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. లిక్కర్ ఆదాయం తగ్గడం.. జీఎస్టీ నష్టాలు పెరిగిపోవడంతో పాటు ట్యాక్స్ కలెక్షన్ పడిపోయింది. అదే సమయంలో సంక్షేమ పథకాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. దీని వల్ల లక్షల కోట్ల అప్పులు పెరిగిపోతున్నాయి.



కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక సహకారం లభించ లేదు. కరోనా కాలంలోనూ మరింత ఇబ్బంది. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వమే.. రాష్ట్రంలోని పర్యాటకంతోపాటు ఆర్థిక సామర్థ్యం ఉన్న మరిన్ని అవకాశాలను అన్వేషించింది. ఇందులో భాగంగానే విశాఖ తీరంలో Casino బోట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

విశాఖ తీరంలో ఏర్పాటు చేయబోయే Casino shipsలో పెట్టుబడి పెట్టడానికి ఇప్పటికే 2 సంస్థలు ముందుకొచ్చాయి. పెట్టుబడి ద్వారా భారీగా GST, ట్యాక్స్‌లు రావొచ్చని అంచనా. హోటల్ బిజినెస్, ట్రావెల్, లిక్కర్ వ్యాపారం కూడా పెరుగుతుందని.. స్థానికంగా ఉపాధి అవకాశాలు దండిగా పెరుగుతాయని ప్లాన్ చేస్తుంది. క్యాసినో అంటే చాలా లగ్జరీ.. అత్యంత సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.



ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పేకాట, క్యాసినో నిషేధం. అలాంటి వారు అందరూ గోవా, శ్రీ లంక, థాయ్‌లాండ్ వెళుతుంటారు. వినోదం కోసం లక్షలు, కోట్లు వెచ్చిస్తుంటారు. విశాఖ తీరంలో ఏర్పాటు చేస్తే క్యాసినో ద్వారా ఆదాయాన్ని భర్తీ చేయవచ్చు అనేది ఏపీ గవర్నమెంట్ ప్లాన్.

చర్చల దశలో ఉన్న ఈ ప్లాన్.. పెట్టుబడిదారులు యస్ అంటే.. గోవా నుంచి 4 షిప్స్ రాత్రికి రాత్రే తీసుకువచ్చినా నో డౌట్. ఏది ఎలా ఉన్నా సముద్రంలో ఏం జరిగినా రాష్ట్రానికి ఆదాయం రావడం మాత్రం పక్కా.