Andhra Pradesh : 142 కరోనా కేసులు…ఇద్దరు మృతి

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 32 వేల 793 శాంపిల్స్ పరీక్షించగా…142 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.

AP Corona Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ వెలుగు చూడడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. జాగ్రత్తలు తీసుకోవాలంటూ..రాష్ట్రాలకు సూచించింది. అయితే..ఏపీలో గతంలో కన్నా..తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 142 మందికి కరోనా సోకింది. ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,71,675 పాజిటివ్ కేసులకు గాను… 20,55,206 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,462 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య వేయి 989 ఉందని తెలిపింది.

Read More : SBI Services : నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 32 వేల 793 శాంపిల్స్ పరీక్షించగా…142 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. కోవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణాలో ఒక్కొక్కరు మరణించారని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 188 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,07,15,406 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : Haleem laddu : హ‌లీమ్ ల‌డ్డూలు..తినాలనిపిస్తే వేడి చేసుకుని లాగించేయటమే..!!

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 17. చిత్తూరు 14. ఈస్ట్ గోదావరి 21. గుంటూరు 28. వైఎస్ఆర్ కడప 02. కృష్ణా 13 కర్నూలు 01 నెల్లూరు 06. ప్రకాశం 04. శ్రీకాకుళం 07. విశాఖపట్టణం 10. విజయనగరం 02. వెస్ట్ గోదావరి 17. మొత్తం : 142.

ట్రెండింగ్ వార్తలు