Haleem laddu : హ‌లీమ్ ల‌డ్డూలు..తినాలనిపిస్తే వేడి చేసుకుని లాగించేయటమే..!!

రంజాన్‌ మాసం వచ్చిదంటే చాలు హైదరాబాద్ నగరం అంతా హలీమ్ ఘుమఘుమలతో నిండిపోతుంది.ఆ తరువాత హలీమ్ తినాలంటే దొరకదు. కానీ హలీమ్ ప్రియుల కోసం హలీమ్ లడ్డులు. హీట్ చేసుకుని తినేయటమే..

Haleem laddu : హ‌లీమ్ ల‌డ్డూలు..తినాలనిపిస్తే వేడి చేసుకుని లాగించేయటమే..!!

Haleem Laddu

Haleem laddu : రంజాన్‌ మాసం వచ్చిదంటే చాలు హైదరాబాద్ నగరం అంతా హలీమ్ ఘుమఘుమలతో నిండిపోతుంది. హైదరాబాద్ భిన్న రుచుల ఆహార పదార్ధాలకు నిలయం..ధమ్ బిర్యానీ,హలీమ్‌, ఇరానీ చాయ్, 100ల రకాల పాన్ లు ఇలా ఎన్నో ఎన్నెన్నో రుచులు రా రమ్మని పిలుస్తాయి. నగరంలో ఏమూలకు వెళ్లినా అక్కడో ప్రత్యే రుచి నోరూరిస్తుంటుంది. హైదరాబాద్ లో తయారయ్యే బిర్యానీ ఇతర దేశాలకు ఎగుమతి అయినట్లే హలీమ్ కూడా అలాగే ఎక్స్ పోర్టు అవుతుంటుంది. హైదరాబాద్ ధమ్ బిర్యానీ మన పక్క దేశం దాయాది దేశమైన పాకిస్థాన్ కు టన్నుల కొద్దీ ఎగుమతి అవుతుంటుంది.

Read more : Egg Popcorn : గుడ్డుతో పాప్ కార్న్..2 మినిట్స్ లో రెడీ..

రంజాన్ నెల వెళ్లిపోయిందంటే ఇక హలీమ్ ఘుమఘమలు చల్లారిపోతాయి.ఏదో ఒకటీ రెండు చోట్ల తప్ప పెద్దగా కనిపించవు. కానీ హలీమ్ అన్ని రోజులు దొరికితే ఎంత బాగుండు ఎంచక్కా తినొచ్చు అని చాలాసార్లు అనుకుంటాం. హలీమ్ ను నిల్వ చేసుకునే అవకాశముంటే ఎంత బాగుండు..ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనుకుంటాం. మరి ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చేవారు చాలామందే ఉంటారు. అలా హలీమ్‌ ప్రియుల కోసం పరిశోధకులు హలీమ్ ను నిల్వ చేసి తినేలా పరిశోధనలు కూడా జరిగాయి.

హలీమ్‌ ప్రియుల కోసం జాతీయ మాంసం అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌సీఎం) హలీమ్‌ను నిల్వ చేసుకొని, తినేలా హలీమ్‌ను లడ్డూల్లా తయారు చేశారు. రుచిలో ఏమాత్రం తేడా రాకుండా, నిల్వ చేసినా పాడైపోకుండా ఎటువంటి ఫంగస్‌ దరిచేరనివ్వని పద్ధతుల్లో హలీమ్ లడ్డూల్ని తయారు చేశారు. వీరి పరిశోధనలు విజయవంతం కావటంతో హలీమ్ లడ్డూలు తయారయ్యాయి. వీటికి హాలీం బాల్స్‌ అని పేరు కూడా పెట్టారు. నామకరణం చేశారు.

Read more : Mirchi ice cream : ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్‌..!ఏం వంటకాల్రా బాబూ…ఎలా వస్తాయిరా నాయినా ఇలాంటి ఐడియాలు..!!

ఈ హలీబ్ లడ్డుల పేటెంట్‌ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసేశారు. త్వరలోనే పేటెంట్‌ వస్తుందనే నమ్ముతున్నారు పరిశోధకులు. పేటెంట్‌ వచ్చాక టెక్నాలజీని ప్రైవేటు సంస్థకు ట్రాన్స్ ఫర్ చేస్తారట. ఈ తరువాత ఇంకేముంది? ఎప్పుడంటే అప్పుడు మనం కొనుక్కుని వేడిచేసి తినేలా ఇవి అందుబాటులోకి వస్తాయన్నమాట. పేటెంట్ హక్కు వస్తే..బహిరంగ మార్కెట్‌లో హలీమ్‌ బాల్స్‌ లభ్యం కానున్నాయి. వాటిని ప్యాక్‌ చేసి నిల్వ చేసుకోవచ్చు. ఈజీగా రవాణా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తినాలనుకొంటే వేడి చేసి లాగించేయొచ్చు అంటున్నారు పరిశోధకులు.హీట్‌ అండ్‌ ఈట్‌ విధానంలో తయారైన ఈ హలీమ్ లడ్డులు ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయని హలీమ్ ప్రియులు వేచి చూస్తున్నారు.

Read more : Fanta Omelette: ఫాంటా కూల్ డ్రింక్ తో ఆమ్లెట్ ..మీరెప్పుడైనా తిన్నారా..