Fanta Omelette: ఫాంటా కూల్ డ్రింక్ తో ఆమ్లెట్ ..మీరెప్పుడైనా తిన్నారా..

ఎగ్ లో ఉప్పూ కారం వేసి ఆమ్లెట్ తినే ఉంటారు.అలాగే బ్రెడ్ ఆమ్లెట్, వెజిటబుల్ ఆమ్లెట్ కూడా తినే ఉంటారు. కానీ ఫాంటా కూల్ డ్రింక్ తో చేసిన ఆమ్లెట్ తిని ఉండరు. వైలర్ గా మారిన ఈ ఫాంటా కూల్ డ్రింక్ తో చేసిన ఆమ్లెట్ ని ట్రై చేయండీ.. టేస్ట్ వెరీ డిఫరెంట్ అంట..

Fanta Omelette: ఫాంటా కూల్ డ్రింక్ తో ఆమ్లెట్ ..మీరెప్పుడైనా తిన్నారా..

Fanta Amelette

Fanta Amlet : ఆమ్లెట్‌ను ఎలా తయారు చేస్తాం..? ఎగ్‌లో ఉప్పూ, కారం వేసి ఆమ్లెట్‌లా వేస్తాం. ఇంకా కూరగాయలు వేసి కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు. బ్రెడ్ తో కూడా ఆమ్లెట్ వేస్తారు. ఇంకా వెరైటీలు చాలానే ఉన్నాయి ఆమ్లెట్లలో. ఆమ్లెట్ ఎలా వేసుకున్నా రుచిగానే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ తో ఆమ్లెట్ తయారు చేసినది తిన్నారా? పోనీ విన్నారా? అంటే కాస్త ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఒకతను మాత్రం ఆమ్లెట్‌‌లో ఏకంగా ఫాంటా కూల్ డ్రింగ్ పోసి వెరైటీ ఫుడ్ తయారు చేశాడు. దీనిని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

ఈ ఫాంటా ఆమ్లెట్ వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్ నగరంలోని ఓ షాపులో వేసిన ఆమ్లెట్ వేయటం చూస్తే..ఓర్నీ ఇలా కూడా వేస్తారా? అనిపిస్తోంది. ఈ వెరైటీ ఆమ్లెట్‌ను ఫాంటా కూల్ డ్రింక్ తో కలిపి తయారుచేయడం. సూరత్‌లోని ఒక వినయ్ రావత్ ఫుడ్ బ్లాగర్ ఫాంటా ఆమ్లెట్ వేశాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది? నెటిజన్లు ఊరుకుంటారా ఏంటీ..దాన్ని వైరల్ చేసి పారేశారు. ఈ వీడియోలో ఫాంటా ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని చూపించాడు. ఈ ఫాంటా ఆమ్లెట్ టేస్ట్ చూద్దామని ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు.

దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇండియన్‌ ఈట్‌ మానియా’ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేసిన ఈ వీడియో.. ఇప్పటికే 87,000 మంది చూశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వేడివేడి ఆమ్లెట్‌లో చల్లని ఫాంటా పోయాలన్న నీ ఆలోచనకు దండంరా బాబు అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే మరొకరు ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయి రాబాబూ..జనాల్ని హాస్పిటల్ పాలు చేయటానికా అంటూ ఇంకొందరు ఇలా మొత్తానికి ఈవీడియో ప్రస్తుతం నెట్టింట్లో దూసుకుపోతోంది.

ఈ వీడియోలో చెఫ్… ఎగ్స్ పగలగొట్టి… ప్యాన్‌పై వేశాక… దానిపై ఫాంటా పోస్తున్నారు. ఫ్రై చేస్తున్నారు. ఆ తర్వాత… దాన్ని రెగ్యులర్ ఎగ్ ఆమ్లెట్‌లా కాకుండా… పేస్టులా చేస్తున్నారు. దానికి బన్ ఇస్తున్నారు. ఇప్పుడు బన్‌ను, ఆ పేస్టులో ముంచుకొని తినడమే. అది కాస్త తియ్యగా ఉందని… టేస్ట్ కొత్తగా ఉందని వినయ్ రావత్ చెబుతున్నారు.