Mirchi ice cream : ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్‌..!ఏం వంటకాల్రా బాబూ…ఎలా వస్తాయిరా నాయినా ఇలాంటి ఐడియాలు..!!

కొత్త కొత్త వంట‌కాల వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ ట్రెండ్ లో మరో కొత్త వంటకంతో ఆకట్టుకుంటున్నాడో వ్యక్తి. అదే ‘పచ్చిమిర్చి ఐస్ క్రీమ్’.

Mirchi ice cream : ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్‌..!ఏం వంటకాల్రా బాబూ…ఎలా వస్తాయిరా నాయినా ఇలాంటి ఐడియాలు..!!

Mirchi Ice Cream

Mirchi ice cream viral : కొత్త కొత్త వంట‌కాల వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వాటి టేస్ట్ ఎలా ఉంది?అనేది కాదు ముఖ్యం.కొత్త పేరుతోవైరల్ అయ్యిందా? లేదా అనేది ముఖ్యం. అలా ఇప్పటికే వెరైటీ వంటకాలు వైరల్ అయ్యాయి.అవుతున్నాయి. అలాగే కొత్తగా మరో వంటకం వైరల్ అవుతోంది. అదే ‘ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్’. ఏంటీ షాక్ అయ్యారా? అవుతారు లెండి..ఎవడ్రా బెల్లంతో బిర్యానీ చేసింది?అని కిక్ సినిమాలో ఇలియానా అన్నట్లుగా ఉంది కదూ..ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్ అనే మాట వినగానే..నిజమే మరి ఈ పేరే వెరైటీ. పిచ్చి కాంబినేషన్ అని అనుకుంటున్నారు కదూ..నిజమే ఐస్ క్రీమ్ అంటే తియ్యగా చల్లగా ఉంటుంది. పచ్చిమిర్చి కారంగా..ఘాటుగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ తో వంటకం అంటే ఇదే పిచ్చిరా బాబూ అని అనుకోకుండా ఎలా ఉంటారు?

Read more : Egg Popcorn : గుడ్డుతో పాప్ కార్న్..2 మినిట్స్ లో రెడీ..

ప‌చ్చిమిర్చీతో ఐస్‌క్రీమ్ తయారు చేసి ఓ స్ట్రీట్ వెండ‌ర్ స్థానికంగా తెగ ఫేమ‌స్ అయ్యాడు. ఇండోర్‌కు చెందిన ఓ స్ట్రీట్ వెండ‌ర్‌.. ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్ త‌యారు చేసి వావ్ అనిపిస్తున్నాడు. అక్క‌డి జ‌నాలు అయితే.. ప‌చ్చి మిర్చీతో చేసిన ఐస్‌క్రీమ్‌ను లొట్ట‌లేసుకుంటూ మరీ తింటున్నారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటో అనుకుంటున్నారా? చూడండీ..ఐస్‌క్రీమ్‌ను కూడా రోల్‌లా త‌యారు చేసి స‌ర్వ్ చేస్తున్నాడు. ప‌చ్చి మిర్చీని స‌న్న‌గా త‌రిగి.. దాంట్లో న్యూటెల్లా.. చాకొలేట్, మిల్క్ క్రీమ్‌ను యాడ్ చేసి.. వాటిని మొత్తం మిక్స్ చేసి.. రోల్స్‌లా త‌యారు చేసి.. మిర్చీ ఐస్‌క్రీమ్ పేరుతో అమ్ముతున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు అయితే.. ఆ స‌రికొత్త ఐస్‌క్రీమ్‌ను చూసి షాక్ అవుతున్నారు.

Read more : Butter Chicken Golgappe : బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప.. నెట్టింట్లో రచ్చ

55 సెకన్ల ఈ వీడియో క్లిప్‌లో..సదరు వ్యక్తి పచ్చిమిరపకాయలను కోసి, దానిపై నుటెల్లాను జోడించి..ఆ తర్వాత మిల్క్ క్రీమ్ పోసి బాగా కలుపుతాడు. తరువాత ఈ మిశ్రమాన్ని రోల్స్‌గా చేసి ఫ్రీజర్‌లో ఉంచుతాడు. ఈ రెసిపీలో ఎక్కువగా మిరపకాయలు జోడించి.. ఐస్‌క్రీమ్‌ను కస్టమర్‌కు అందిస్తాడు.ఈ చిత్ర విచిత్రమైన ఐస్ క్రీం క్లిప్‌ను రిషబ్ సింగ్ అనే పేరుతో ఇండోర్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ షేర్ చేశాడు. ఈ విచిత్రమైన ఐస్ క్రీం వీడియోను లక్షలమంది చూశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే ‘‘ఏది పడితే అది ఎలా ప‌డితే అలా.. ఏది ప‌డితే అది.. ఎలా త‌యారు చేస్తార్రా బాబూ..ఈ పిచ్చి వంటకాల గోలేంట్రా బాబూ’’ అంటున్నారు.

Read more : China Virgin Boy Egg : ‘మూత్రం’తో ఉడికించిన గుడ్లు..లొట్టలేసుకుంటు తినేస్తున్న చైనీయులు