Butter Chicken Golgappe : బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప.. నెట్టింట్లో రచ్చ

బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప అనే కొత్త ర‌కం చాట్ గురించి ట్విట్ట‌ర్‌లో చ‌ర్చ మొద‌లైంది. మ్యాగీ మిల్క్ షేక్, ఫాంటాతో ఆమ్లెట్ వంటి వింత వంటకాలు ఎలా వైరల్ అయ్యాయో..ఇది కూడా అలాగే వైరల్ గా

Butter Chicken Golgappe : బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప.. నెట్టింట్లో రచ్చ

Butter Chicken Golgappe

Butter Chicken Golgappe : గోల్‌గ‌ప్ప.దాన్నే పానీపూరి అంటాం.బుల్లిపూరీలో మధ్యలో గుంట చేసి పుదీనా, నల్లమిరియాలుతో ఘాటైన చేసిన టేస్టీ టేస్టీ వాటర్ పోసి..కాస్తంత గోల్గప్ప కోసం తయారు చేసిన బఠాఠీ కూర వేసి ఆ బుల్లిపూరీని నోట్లో పెట్టుకుంటే నా సామిరంగా స్వర్గం నోట్లోనే తాండవించదూ. అదే పానీపూరీ అంటే. పానీ పూరీ తిన్నాక కూడా భయ్యా కాసిన వాటర్ పొయ్యి అని అడిగి మరీ పానీ పోయించుకుని తాగుతాం. అదీ పానీపూరి అంటే..కానీ ఇప్పుడు నెట్టింటిలో ఓ వెరైటీ పానీపూరీ రచ్చ రచ్చ చేస్తోంది. అదే ‘బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప.. ’

ఈ మధ్యకాలంలో వెరైటీ వెరైటీ ఫుడ్ లు నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తున్నాయి. ఒకరు మ్యాగీ మిల్క్ షేక్ తయారు చేసి ఎవడ్రా వీడు..అరె ఏంట్రా ఇది అనిపించుకుని వైరల్ అయ్యాడు.మరొకరు ఫాంటా కూల్ డ్రింక్ తో ఆమ్లెట్. అంటూ రచ్చ ఇలా వెరైటీ ఫుడ్ లు వైరల్ గా మారాయి. అటువంటిదే ఈ బటర్ చికెన్ గెల్ గప్ప.

Fanta Omelette: ఫాంటా కూల్ డ్రింక్ తో ఆమ్లెట్ ..మీరెప్పుడైనా తిన్నారా..

ఇప్పుడు బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప అనే కొత్త ర‌కం చాట్ గురించి ట్విట్ట‌ర్‌లో చ‌ర్చ మొద‌లైంది. పంజాబీ గ్రేవీ చికెన్‌ క‌ర్రీ, పానీపూరిల మిశ్ర‌మ‌మే ఈ బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప‌. మీరు ఇప్ప‌టికే చాకొలేట్ గోల్‌గ‌ప్ప‌, మీఠా గోల్‌గప్ప‌, ఆఖ‌రికి ఫైర్ గోల్‌గ‌ప్ప‌ను కూడా ట్రై చేసి ఉండ‌ొచ్చు. కానీ ఈ బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప వాటికంటే కూడా ఒకింత డిఫరెంట్ అనే చెప్పాలి. డెల్వినా అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ ఈ స‌రికొత్త చాట్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

పంజాబ్ ప్ర‌జ‌లు వండుకునే ఒక క్లాసిక్ చికెన్ క‌ర్రీ, వీధుల్లో ల‌భించే ఒక పాపుల‌ర్ స్నాక్ మిశ్ర‌మ‌మే ఈ బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప‌ వెరైటీ. గోల్‌గ‌ప్ప స్నాక్‌లో బ‌ఠానాకు బ‌దులుగా బ‌ట‌ర్ చికెన్ కూరితే అది బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప అవుతుదన్నమాట. చూశారా ఎంత ఈజీనో. కాకపోతే ఈ వెరైటీ వంటకానికి నెటిజ‌న్‌ల నుంచి విభిన్నమైన స్పందన వచ్చింది.

Maggi Milkshake: ‘మ్యాగీ మిల్క్‌షేక్’ వింత వంటకంపై..నెట్టింట్లో తిట్ల దండకం

జీవితంలో ఇలాంటి ప్ర‌యోగాలు అస్స‌లే చేయ‌కూడ‌దు అని ఇంకొంద‌రు నెటిజ‌న్‌లు అంటుంటే..మరికొందరు మాత్రం ఈ కాంబినేష‌న్‌ను ట్రై చేయొచ్చు పోయిందేముంది? అంటున్నారు. గోల్‌గ‌ప్ప‌కు బ‌ట‌ర్ చికెన్ క‌లపడవల్ల టేస్ట్ బాగా ఉంటుండ‌వ‌చ్చ‌ని ఇంకొకరు ఇలా ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎవరి నచ్చినా నచ్చకపోయినా ఈ బ‌ట‌ర్ చికెన్ గోల్ గప్ప మాత్రం వైరల్ అయి నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తోంది. మరి ఇదెలా ఉందో తెలియాలంటే ఈ వెరైటీ చాట్‌ను టేస్ట్ చేస్తారా?