Andhra Pradesh : 24 గంటల్లో 2 వేల 620 కరోనా కేసులు, 44 మంది మృతి

24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో 2 వేల 620 కరోనా కేసులు వెలుగు చూశాయి. 44 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 వేల 140 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 363 మంది మృతి చెందారు.

AP Covid 19 : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో నిబంధనలు, ఆంక్షలను ప్రభుత్వం తొలగిస్తోంది.

తాజాగా..24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో 2 వేల 620 కరోనా కేసులు వెలుగు చూశాయి. 44 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 వేల 140 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 363 మంది మృతి చెందారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,50,288 పాజిటివ్ కేసులకు గాను 17,79,785 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా మృతుల వివరాలు :

చిత్తూరులో పది మంది, గుంటూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 128. చిత్తూరు 531. ఈస్ట్ గోదావరి 335. గుంటూరు 158. వైఎస్ఆర్ కడప 162. కృష్ణా 213. కర్నూలు 161. నెల్లూరు 201. ప్రకాశం 127. శ్రీకాకుళం 144. విశాఖపట్టణం 160. విజయనగరం 88. వెస్ట్ గోదావరి 211. మొత్తం : 2,620

 

read:Andhra Pradesh-Telangana: సోమవారం నుంచి టీఎస్ఆర్టీసీ సేవలు.. ఇతర రాష్ట్రాలకు సర్వీసులు

ట్రెండింగ్ వార్తలు