Andhra Pradesh-Telangana: సోమవారం నుంచి టీఎస్ఆర్టీసీ సేవలు.. ఇతర రాష్ట్రాలకు సర్వీసులు

Andhra Pradesh-Telangana: సోమవారం నుంచి టీఎస్ఆర్టీసీ సేవలు.. ఇతర రాష్ట్రాలకు సర్వీసులు

tsrtc-

Andhra Pradesh-Telangana: తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారమే ప్రకటించేసింది. వాయిదా పడ్డ ప్రయాణాలను పూర్తి చేయాలని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. సోమవారం నుంచి అంతర్రాష్ట్ర బస్సులతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులు నడిపించనున్నారు.
ప్రభుత్వ అంగీకారంతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. ఏపీకి సైతం బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించేసింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం బస్సు సర్వీసులకు ఉపశమనం కల్పించినట్లు అయింది. ప్రతిరోజూ సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫూ అమల్లో ఉండనుంది. ఈ క్రమంలోనే అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
కర్ఫూ నిబంధనలకు అనుగుణంగా కర్ఫ్యూ సమయానికి ముందే ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేవిధంగా బస్సులు నడిపించనున్నారు. ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.