Ap Corona Cases
Andhra Pradesh New Covid 19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా భూతం వదులుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి ప్రజలు బయటపడుతున్నారు. గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు డబుల్ డిజిట్ కు పరిమితమయ్యాయి. కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 88 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణం సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Read More : AP Covid : ఏపీలో కరోనా లేటెస్ట్ అప్‌డేట్.. రెండు జిల్లాలో సున్నా కేసులు..మరణాలు లేవు
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,18,705 పాజిటివ్ కేసులకు గాను…23,03,227 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,729 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 749గా ఉందని తెలిపింది. విజయనగరంలో జిల్లాలో సున్నా కేసులు నమోదయ్యాయి. 12 వేల 208 శాంపిల్స్ పరీక్షించగా…88 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 97 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,32,25,212 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.
Read More : AP Covid Cases : ఏపీలో కరోనా ఖతమ్..! భారీగా తగ్గిన కేసులు, సున్నా మరణాలు
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 28. చిత్తూరు 08. ఈస్ట్ గోదావరి 08. గుంటూరు 08. వైఎస్ఆర్ కడప 05. కృష్ణా 03. కర్నూలు 03. నెల్లూరు 06. ప్రకాశం 12. శ్రీకాకుళం 01. విశాఖపట్టణం 03. విజయనగరం 0. వెస్ట్ గోదావరి 03. మొత్తం : 88
#COVIDUpdates: 10/03/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,18,705 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,227 మంది డిశ్చార్జ్ కాగా
*14,729 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 749#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/6ngDCQ1vhg— ArogyaAndhra (@ArogyaAndhra) March 10, 2022