AP Covid : ఏపీలో కరోనా లేటెస్ట్ అప్‌డేట్.. రెండు జిల్లాలో సున్నా కేసులు..మరణాలు లేవు

24 గంటల వ్యవధిలో 70 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణం సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP Covid : ఏపీలో కరోనా లేటెస్ట్ అప్‌డేట్.. రెండు జిల్లాలో సున్నా కేసులు..మరణాలు లేవు

Ap Covid Update

Andhra Pradesh New Covid 19 Cases : ఏపీ రాష్ట్రం కరోనా వైరస్ నుంచి క్రమక్రమంగా బయటపడుతోంది. గణనీయంగా కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. వేల సంఖ్యలో నమోదైన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 70 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణం సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Kiara Advani: కరోనా అయిపోయిందా.. మాస్కులు పెట్టుకోవడం లేదేం – కైరా అద్వానీ

ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,18,617 పాజిటివ్ కేసులకు గాను…23,03,130 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,729 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 758గా ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో సున్నా కేసులు నమోదయ్యాయి. 11 వేల 408 శాంపిల్స్ పరీక్షించగా…70 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 129 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,32,13,004 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : India Covid : దేశంలో కంట్రోల్‌‌‌లోకి వస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 13. చిత్తూరు 07. ఈస్ట్ గోదావరి 09. గుంటూరు 12. వైఎస్ఆర్ కడప 03. కృష్ణా 07. కర్నూలు 02. నెల్లూరు 06. ప్రకాశం 02. శ్రీకాకుళం 0. విశాఖపట్టణం 04. విజయనగరం 0. వెస్ట్ గోదావరి 05.