India Covid : దేశంలో కంట్రోల్‌‌‌లోకి వస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే

వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 416 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 178.90 కోట్ల డోసుల టీకాలు...

India Covid : దేశంలో కంట్రోల్‌‌‌లోకి వస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే

India Corona

India New Covid Cases : భారత్ లో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్లేనని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దాదాపు ఐదు వేల లోపు కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీలుస్తున్నారు. మరణాల సంఖ్య దాదాపు తగ్గుతోంది. తాజాగా..4 వేల 362 కేసులు నమోదు కాగా.. 66 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54,118 యాక్టీవ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read More : Telangana Corona : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా 82 కేసులు

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 416 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 178.90 కోట్ల డోసుల టీకాలు అందచేశారు. ఆదివారం 4,80,144 డోసుల టీకాలు అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 178,90,61,887 డోసుల టీకాలు అందచేయడం జరిగిందని వెల్లడించింది.

Read More : AP Covid Cases : ఏపీలో కరోనా ఖతమ్..! భారీగా తగ్గిన కేసులు, సున్నా మరణాలు

ఇంకోవైపు..కరోనా నిర్ధారించేందుకు జరుగుతున్న టెస్టులు కొనసాగుతున్నాయి. కరోన నిర్ధారణ పరీక్షలు 77.34 కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,12,926 టెస్టులు నిర్వహించినట్లు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77,34,37,172 టెస్టులు జరిగాయని ICMR తెలిపింది. దేశవ్యాప్తంగా 3309 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలకు 1426 ప్రభుత్వ లాబ్స్,1883 ప్రైవేట్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి.