Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 16న సుప్రీంకోర్టు తీర్పు?

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత ఏడాది అక్టోబర్‌లో తుది విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈ నెల 16న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు 17 ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది.

జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత ఏడాది అక్టోబర్‌లో తుది విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదని చంద్రబాబు అప్పట్లో పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయగా, ఆయనకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఈ కేసులో మరికొందరూఅరెస్ట్ అయ్యారు. షెల్ కంపెనీల ద్వారా కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు కోసమే వైసీపీ ఇటువంటి కేసులు పెట్టిస్తోదంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఏపీ ఎన్నికల ముందు సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Chandrababu Naidu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. ఆ సమయంలో..