Chandrababu Naidu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. ఆ సమయంలో..

కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు అభివాదం చేశారు. ఓ చిన్నారిని ఎత్తుకున్నారు.

Chandrababu Naidu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. ఆ సమయంలో..

Chandrababu At CID Office

Updated On : January 13, 2024 / 4:55 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడ తులసి నగర్‌లోని సీఐడీ ఆఫీసుకు వెళ్లారు. ఆయనను చూసిన వెంటనే ‘జై బాబు.. జై జై బాబు’ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు అభివాదం చేశారు. ఓ చిన్నారిని ఎత్తుకున్నారు.

సీఐడీ ఆఫీసు లోపలికి వచ్చేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారికీ, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. ఇసుక కేసులో సీఐడీ అధికారులకు చంద్రబాబు హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు, బాండ్‌ సమర్పించారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. మద్యం కేసులో పూచీకత్తు, బాండ్లు సమర్పించారు. అలాగే, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కుంచనపల్లి సీఐడీ కార్యాలయంలో పూచీకత్తు, బాండ్లు సమర్పించారు.

ఆయా కార్యాలయాల వద్దకు చంద్రబాబు రావడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతరులు ఎవరినీ అనుమతించలేదు. చంద్రబాబుకు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు ‘పూచీకత్తు’ సంతకాలు చేశారు.

కాగా, ఇన్నర్‌ రింగ్ రోడ్డుతో పాటు మద్యం, ఇసుక కేసుల్లో హైకోర్టు కొన్ని రోజుల క్రితం చంద్రబాబుకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే. పూచీ కత్తు సమర్పించాలని ఆ సమయంలో హైకోర్టు ఆదేశించింది.

Magunta Sreenivasulu Reddy: మాగుంటతో చీరాల ఎమ్మెల్యే కీలక భేటీ.. ఒంగోలులో ఎంపీ ఆఫీసు వద్ద హడావిడి