ఏపీ స్పేస్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం.. స్పేస్ సిటీలో భూ కేటాయింపు, అంకుర సంస్థలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు

శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. స్పేస్ సిటీలో భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలన, ప్రాసెస్ కోసం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఏపీ స్పేస్ పాలసీని ప్రకటించింది. 2025-30 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా స్పేస్ పాలసీ మార్గదర్శకాలను వెల్లడించింది అంతరిక్ష రంగంలోఅభివృద్ది, స్పేస్ పాలసీ అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాల ఇచ్చింది.

కార్పొరేషన్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలని నిర్దేశించింది. కార్పొరేషన్ ద్వారా స్పేస్ విభాగంలోని దేశీయ, అంతర్జీతీయ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరుచుకోవాలని చెప్పింది.

Also Read: రూ.500 నోట్లను ఏటీఎంలలో పెట్టకూడదని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిందా? నిజం ఇదే..

అంతరిక్ష ప్రాజెక్టులను అమలు చేయడానికి పెట్టుబడిదారులకు కార్పొరేషన్ సహాయం చేస్తుందని వెల్లడించింది. శ్రీ సత్యసాయి , తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. స్పేస్ సిటీలో భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలన, ప్రాసెస్ కోసం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

పరిశ్రమల కమిషనర్ ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయలని ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. అంకుర సంస్థలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పింది. తగిన చర్యలు తీసుకోవాలని ఎపీఐఐసీ ఛైర్మన్, ఎండీని ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.