పవన్ కల్యాణ్ మాటల వెనుక పద్మవ్యూహం.. ఇందుకే సౌండ్ పెంచుతున్నారా?

ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతమైన నాయకుడిగా.. డిప్యూటీ సీఎం హోదాలోనే రెస్పాండ్‌ అవుతున్నారే తప్ప..కూటమిలో అసంతృప్తి అనో..మరో రకంగానే డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాయి జనసేన వర్గాలు.

పవన్ కల్యాణ్ మాటల వెనుక పద్మవ్యూహం.. ఇందుకే సౌండ్ పెంచుతున్నారా?

Updated On : October 13, 2025 / 9:06 PM IST

Pawan Kalyan: పవన్ కల్యాణ్.. హీరోగా..ఓ పొలిటీషియన్‌గా ఈ పేరే ఓ బ్రాండ్. పార్టీ పెట్టి పదేళ్లు పోరాడిన పవన్‌..అప్పట్లో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఓ రేంజ్‌లో మండిపడేవారు. ఎప్పటికప్పుడు సమస్యలను ఎక్స్‌పోజ్ చేస్తూ..ప్రశ్నించే గళంగా ప్రజల మన్ననలను పొందారు పవర్ స్టార్. ఇప్పుడాయన ఫ్యూర్ పొలిటిషయన్. అయినా సరే తానేం మారలేదంటున్నారు పవన్. ఎప్పుడూ ప్రజల పక్షామే..జనం సమస్యే తన ఎజెండా అన్నట్లుగా కూటమి ప్రభుత్వంలో అపోజిషన్ పాత్ర పోషిస్తున్నారు.

ఏ చిన్న అంశమైన విపక్ష వైసీపీ కంటే పవన్ స్పందిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్లినా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న పవన్..వాటి పరిష్కారంపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెడుతున్నారు. లేటెస్ట్‌గా కాకినాడ జిల్లాలో సముద్ర కాలుష్యంపై క్షేత్రస్థాయి పర్యటన చేసిన పవన్..పీసీబీ అధికారులతో సమీక్షించి కాలుష్యం నివారణకు పకడ్బందీ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు టైమ్ బాండ్ ఫిక్స్ చేసుకున్నారు. సమస్యలను పరిష్కరించలేని నాడు రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చి చర్చకు దారి తీశారు.

Also Read: రోజుకో ఇష్యూ.. సీఎం, పీసీసీ చీఫ్‌ జోక్యం చేసుకున్నా తెగని పంచాయితీ.. అక్కడితో ఆగకుండా..

ఇక మంత్రివర్గ సమావేశంలో లులు గ్రూప్ విషయంలో ఏకంగా ప్రశ్నల వర్షమే కురిపించారు పవన్. లులు గ్రూప్ పెట్టే కండిషన్లతో ఏపీకి వచ్చే పెట్టుబడులు ఎన్ని.? ఇచ్చే ఉపాధి ఎంత అనే అంశాలపై ఆయన అధికారులను ప్రశ్నిలు వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేశారట. ఎంతో విలువైన భూముల ఇస్తే ఆ పరిశ్రమలు ద్వారా స్థానికులకు వచ్చే లబ్ది ఎంత అనేదానిపై పవన్ వాయిస్ రేజ్‌ చేశారట. ఇక ఉచిత ప‌థ‌కాలు ఎవ‌రికి.? ఎందుకు? అనే కోణంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి.

ఏపీలో యువ‌త ఉచితాలు, సంక్షేమ ప‌థ‌కాలు అడ‌గ‌డం లేదు..25 సంవ‌త్సరాల భ‌విత‌ను కోరుకుంటున్నారని పవన్ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అయితే రాష్ట్ర స‌ర్కారులో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న ప‌వ‌న్‌..ఉచిత ప‌థ‌కాలు ఎవ‌రూ కోరుకోవ‌డం లేద‌ని చెప్పడం విమ‌ర్శల‌కు దారితీసింది. అయితే తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేయడం పవన్ నైజం. అధికారంలోకి వచ్చిన కొత్తలో కాకినాడ రేషన్ బియ్యం ఇష్యూలో సీజ్ ది షిప్ అని అందరి దృష్టిని ఆకర్షించారు.

నిత్యం ప్రశ్నించే గళం

పవన్‌ వ్యాఖ్యలు కూటమిలో అసంతృప్తి రాగం అన్నట్లుగానే బయటికి కనిపిస్తున్నాయి. కానీ పవన్ కల్యాణ్ రూటెప్పుడు సెపరేటు. ఆయనకు వామపక్ష భావజాలం అంటే ఇష్టం. చేగువేరా సిద్ధాంతాలను తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ..నిత్యం ప్రశ్నించే గళంగా ఉండేందుకు ఇష్టం పడతారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా..కొన్ని విషయాల్లో ప్రజా కోణంలో..ఓపెన్‌గానే తన అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. సేనాని కామెంట్స్‌ను వైసీపీ అస్త్రంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోంది.

అయితే అధికారంలో ఉండి..పైగా కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూ..పవన్‌ ఫ్యూచర్‌ బేస్డ్‌గానే వాయిస్‌ రేజ్‌ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపటి రోజున ఏదైనా ఇష్యూపై చర్చ జరిగినప్పుడు తాను అప్పుడే వ్యతిరేకించానని చెప్పుకునేందుకు..పైగా ప్రభుత్వంలో ఉన్నా తాను మౌనంగా లేనని చెప్పేందుకే ఎప్పటికప్పడు తన ఒపీనియస్‌ వ్యక్తం చేస్తున్నారట.

ప్రభుత్వాన్ని మేలుకొలిపేలా..పవన్‌ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారనే చర్చకు జరుగుతోంది. ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతమైన నాయకుడిగా.. డిప్యూటీ సీఎం హోదాలోనే రెస్పాండ్‌ అవుతున్నారే తప్ప..కూటమిలో అసంతృప్తి అనో..మరో రకంగానే డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాయి జనసేన వర్గాలు. ఏదేమైనా పవన్ ప్రశ్నించే గళంగానే ఉంటుండటం ఆసక్తిరేపుతోంది.