AP Electricity Employees: చర్చలు విఫలం.. అక్టోబర్ 15 నుండి విద్యుత్ ఉద్యోగుల సమ్మె..
కీలక రంగాలు, ముఖ్యమైన సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.

AP Electricity Employees: విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ యాజమాన్యం ఎదుట మొత్తం 29 డిమాండ్లు ఉంచినా.. ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదని JAC స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైనా ఎటువంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో అక్టోబర్ 15 నుండి తలపెట్టిన సమ్మె యధావిధిగా కొనసాగుతుందని విద్యుత్ JAC ప్రకటించింది.
ఏడాదిగా చర్చలు జరుగుతున్నా ఫలితం లేకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఇందులో భాగంగా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయనున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ రాష్ట్రంపై భారీగా పడనుంది. కీలక రంగాలు, ముఖ్యమైన సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.
వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం వంటి కీలక అంశాలతో కూడిన 15 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్తు జేఏసీ ప్రభుత్వంతో, విద్యుత్ యాజమాన్యంతో ఏడాదిగా పలు చర్చలు జరిపింది. తాజాగా జరిగిన సమావేశాల్లోనూ ఏ ఒక్క డిమాండ్‌పై సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఏడాది పాటు చర్చలు జరిగినా పరిష్కారం లేకపోవడంతో సమ్మె బాట పట్టనున్నారు.
Also Read: నకిలీ మద్యం గుట్టుపై సిట్.. అసలు డొంక కదిలేనా? ఇప్పటివరకు ఏం జరిగింది? బుక్ అయ్యేదెవరు?