నకిలీ మద్యం గుట్టుపై సిట్‌.. అసలు డొంక కదిలేనా? ఇప్పటివరకు ఏం జరిగింది? బుక్ అయ్యేదెవరు?

ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు సమాచారం అందిందట. దాంతో సిట్ దర్యాప్తుతో అన్ని లింకులు బయటికి వస్తాయని..వైసీపీ ఆరోపణలకు పూర్తిస్థాయి విచారణతోనే చెక్ పెట్టాలనేది చంద్రబాబు వ్యూహమట.

నకిలీ మద్యం గుట్టుపై సిట్‌.. అసలు డొంక కదిలేనా? ఇప్పటివరకు ఏం జరిగింది? బుక్ అయ్యేదెవరు?

Chandrababu Naidu

Updated On : October 13, 2025 / 9:13 PM IST

AP Fake Liquor Case: నిజాన్ని నిర్భయంగా చెప్పి కూడా ఒక్కోసారి మాట పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ కూడా ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తోందట. అసలు నకిలీ మద్యం గుట్టును రట్టు చేసి..అరెస్టులు, దర్యాప్తులు చేస్తూ..ఆఖరుకు సొంత పార్టీ నేతల ఇన్వాల్వ్‌మెంట్‌ ఉంటే సస్పెండ్ చేశామంటోంది టీడీపీ. అయినా తామే లిక్కర్ దందా చేయిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం కూటమి సర్కార్‌కు ఇరిటేటింగ్‌గా మారిందట. ఇదేంటి. ఇంత నిక్కచ్చిగా..దర్యాప్తు చేయించి..అధికారులపై యాక్షన్‌ తీసుకున్నప్పటికీ కూడా మనమే బద్నాం అవుతున్నామంటూ మథన పడుతోందట.

నకిలీ మద్యంలో టీడీపీపై వస్తున్న ఆరోపణలకు సీఎం చంద్రబాబు ఆన్సర్ చెప్పాల్సి రావడం కూడా ఇబ్బందికరంగా మారిందట. ఆల్రెడీ తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డి అనే నేతను టీడీపీ సస్పెండ్ చేసింది. పైగా ఇంకా ఎవరైనా నకిలీ లిక్కర్ దందాలో ఉంటే అరెస్ట్‌లు చేయాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు. అయినా కూడా వైసీపీ నిత్యం అలిగేషన్స్‌ చేస్తుండటం..దానికి టీడీపీ నేతలు రియాక్ట్ అవడమే కాదు..సీఎం చంద్రబాబు స్పందించాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దీంతో సిట్‌ దర్యాప్తుతోనే అన్ని విమర్శలకు, ఆరోపణలకు చెక్ పెట్టాలని భావిస్తోందట కూటమి సర్కార్. (AP Fake Liquor Case)

Also Read: Fake Liquor Case: ఎవరినో అరెస్టు చేసి.. నా పేరు చెబితే అయిపోద్దా? తగ్గేదేలే..: జోగి రమేశ్

నకిలీ మద్యం వ్యవహారంలో ఏదో కుట్ర దాగి ఉందని కూటమి అనుమానిస్తోందట. తమ పార్టీ నేతలను ముందు పెట్టి..వైసీపీ నేతలు తెరవెనుక ఉండి లిక్కర్ దందా చేశారన్నది టీడీపీ డౌట్ అంటున్నారు. అందుకే సిట్‌ను వేస్తే ఇంటి దొంగల భాగోతం బయటపడటమే కాకుండా..వైసీపీ నేతల క్రైమ్ స్టోరీ కూడా వెలుగులోకి వస్తుందని భావిస్తోందట కూటమి సర్కార్.

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఎక్సైజ్‌ సురక్ష పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. నకిలీ మద్యం అనేది కూటమి ప్రభుత్వంలోనే మొదలైంది కాదని..ఇది వైసీపీ హయాంలోనే స్టార్ట్‌ అయిందని చెప్తోంది ప్రభుత్వం. 2019-24 మధ్య నకిలీ మద్యం ప్రారంభమైందని..గంజాయి, డ్రగ్స్‌ దందా కూడా అప్పట్లోనే విచ్చలవిడిగా పెరిగిపోయిందని అంటున్నారు.

లోతుల్లోకి వెళ్లేకొద్దీ షాకింగ్‌ విషయాలు

నకిలీ మద్యం వెనుక కుట్ర ఉందని.. ముసుగు వీరులు ఉన్నారనేది కూటమి సర్కార్ చెప్తున్న మాట. వైసీపీ ప్రభుత్వంలోనే క్వాలిటీ లేని లిక్కర్‌ వ్యవహారం వెలుగు చూసిందని, అప్పటి లింకులే ఇప్పటికి కొనసాగుతున్నాయంటోంది ప్రభుత్వం. నకిలీ మద్యం ఇష్యూలో లోతుల్లోకి వెళ్లేకొద్దీ షాకింగ్‌ విషయాలు తెలుస్తున్నాయట. ఏకంగా ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీ నేర్చుకుని, దానిని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారంటోంది కూటమి ప్రభుత్వ.

రాష్ట్రంలో ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యం వల్లేనని వైసీపీ ప్రచారం చేస్తుందని సీఎం చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో భయం, అలజడి సృష్టించి, ప్రభుత్వం విఫలమైందనే ముద్ర వేయాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నకిలీ లిక్కర్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఓ టాక్‌ బలంగా వినిపిస్తోంది. లిక్కర్ దందా విషయంలో ఇప్పటికిప్పుడు టీడీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా..వారి వెనుకున్నది మాత్రం వైసీపీ నేతలేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు సమాచారం అందిందట. దాంతో సిట్ దర్యాప్తుతో అన్ని లింకులు బయటికి వస్తాయని..వైసీపీ ఆరోపణలకు పూర్తిస్థాయి విచారణతోనే చెక్ పెట్టాలనేది చంద్రబాబు వ్యూహమట. ఏపీలో కల్తీ లిక్కర్ మీద రాజకీయ దుమారం రేగుతోంది. వాడవాడలా ఏకంగా దుకాణాలను తెరచి మరీ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారని వైసీపీ విమర్శిస్తోంది. విపక్షం ఆరోపణలను సీఎం చంద్రబాబు సీరియస్‌గానే తీసుకుంటున్నారట. వైసీపీ చేస్తున్నదంతా ఫేక్ ప్రచారమని..సిట్‌ దర్యాప్తుతోనే క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయిందట కూటమి సర్కార్.