Lepakshi Temple In AP : యునెస్కో గర్తింపుకు ‘అడుగు’దూరంలో విశేషాల లేపాక్షి ఆలయం..!

యునెస్కో గర్తింపుకు ‘అడుగు’దూరంలో విశేషాల లేపాక్షి ఆలయం ఉంది.భారతదేశం నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా అందులో ఏపి నుంచి లేపాక్షి ఆలయం స్ధానాన్ని దక్కించుకుంది.

Ap Anantapur Lepakshi Temple Is A Unesco

Anantapuram Lepakshi Temple In AP : ఏపీలోని అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు దక్కటానికి కేవలం అడుగు దూరంలో ఉంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కింది. భారతదేశం నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా అందులో ఏపి నుంచి లేపాక్షి ఆలయం మొదటిసారి స్ధానాన్ని దక్కించుకోవటం గమనించాల్సిన విషయం. దీంతో ఏపీ నుంచి తాత్కాలిక జాబితాలో మొదటిసారి స్థానం దక్కింది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. తుది జాబితాలో లేపాక్షికి చోటు దక్కితే అరుదైన గుర్తింపు లభించినట్లవుతుంది.

ఎన్నో ఆశ్చర్యపరచే వింతలు, సైన్స్ కు అందని నిర్మాణం ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయం సొంతం. లేపాక్షిలో గల వీరభద్ర దేవాలయంలో 15 అడుగుల ఎత్తు,22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఉట్టిపడే రాజసం ఈ నంది విగ్రహం సొంతం.

108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియ చేస్తుంది. ఇక్కడి పాపనాశేశ్వర స్వామి ని అగస్త్య మహర్షి ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. . ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు,రఘునతముర్తి ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత.

విజయనగర రాజుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు ,రమనియమనైన ప్రదేశం .సీతమ్మవారని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాముల వారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే..పక్షి ! అని మోక్షం ప్రసాదించిన స్థలం. అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతోంది.

పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది.

Ap Anantapur Lepakshi Temple Is A Unesco

ఈ లేపాక్షి ఆలంయంలో వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ. ఇక్కడికి వచ్చే సందర్శకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. సందర్శకులు అంతా ఈ అద్భుతాన్ని చూసి, వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు. ఈ వేలాడే స్థంభం ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందంట. గాలిలో వేలాడే ఈ స్థంభమే ఆ ఆలయానికి కీలకం కావటం వింతలే వింత..