MLA Balakrishna : ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడి.. ఆ హామీతో ఆందోళన విరమించిన అంగన్‌వాడీ వర్కర్లు

ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా ఉచిత పథకాలు, ఉచిత హామీలను నమ్మి మరోసారి మోసపోకండి అని బాలయ్య పిలుపునిచ్చారు. వచ్చే వారంలో హిందూపురానికి వస్తానని, అప్పుడు మీతో కలసి మాట్లాడతానని బాలకృష్ణ చెప్పారు.

MLA Nandamuri Balakrishna

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిని అంగన్ వాడీ వర్కర్లు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలయ్య.. ఆందోళన చేపట్టిన అంగన్ వాడీ వర్కర్లతో ఫోన్ లో మాట్లాడారు. రెండు వారాల నుంచి మీరు రోడ్డెక్కి ఆందోళన చేపట్టి ఒక విప్లవం తీసుకొచ్చారు.

Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

పాదయాత్రలో మీ సమస్యలు పరిష్కరిస్తానని మాయమాటలు చెప్పి జగన్ మోసం చేశారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అని రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసింది ఈ ప్రభుత్వం. మరోసారి మోసపోకండి. వచ్చేది మన ప్రభుత్వమే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము. మహిళలకు రిజర్వేషన్ కల్పించి వారి అభివృద్దికి దోహదం చేసింది టీడీపీ ప్రభుత్వమే. మీ విప్లవాన్ని ఆపొద్దు. రెండు మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీకు నేను అండగా ఉంటాను” అని అంగన్ వాడీ వర్కర్లకు మాట ఇచ్చారు ఎమ్మెల్యే బాలకృష్ణ.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?

ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా ఉచిత పథకాలు, ఉచిత హామీలను నమ్మి మరోసారి మోసపోకండి అని బాలయ్య పిలుపునిచ్చారు. వచ్చే వారంలో హిందూపురానికి వస్తానని, అప్పుడు మీతో కలసి మాట్లాడతానని బాలకృష్ణ చెప్పారు. బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి మీ పోరాటానికి మద్దతిస్తానని మాట ఇవ్వడంతో అంగన్ వాడీ వర్కర్లు తమ ఆందోళన విరమించారు. బాలకృష్ణ ఇంటి దగ్గరి నుంచి వెళ్లిపోయారు.